Begin typing your search above and press return to search.
బ్రాండ్ రకుల్ ను చూసి లొట్టలే
By: Tupaki Desk | 19 Sep 2016 4:26 AM GMTతెలుగు రాష్ట్రాల్లో మొబైల్స్ అమ్మే రిటైల్ చైన్స్ చాలానే ఉన్నాయి. అందులో కొందరు టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్లతో బ్రాండ్ ప్రమోషన్స్ చేయిస్తూ.. అగ్రెసివ్ గా మార్కెటింగ్ వ్యూహాలను అమలు చేస్తున్నారు కూడా. అలాంటి ఓ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా టాలీవుడ్ యంగ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ సైన్ చేసింది.
ఈ సందర్భంగా బ్రాండ్ లాంచింగ్ ఈవెంట్లో అందాలు చిందించేసింది రకుల్. అమ్మడు షార్టు డ్రస్సులో టోన్డ్ లెగ్స్ చూపిస్తుంటే రచ్చ రచ్చే అన్నట్లుంది. ఇలా ఓ బిగ్ బ్రాండ్ తన ఖాతాలోకి రావడం రకుల్ కి సంతోషం ఇచ్చే విషయమే అయినా.. ఇక్కడో సెంటిమెంట్ కూడా ఉందండోయ్. గతంలో ఈ బ్రాండ్ కి సైన్ చేసిన తర్వాత ఇలియానా ఒక్కసారిగా టాప్ స్టేజ్ కి వెళ్లి.. పడిపోయి.. మళ్లీ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. అంతకు ముందు ఛార్మీ కూడా ఇదే బ్రాండ్ కి అంబాసిడర్ గా పని చేసింది. ఆ తర్వాత అమ్మడి పరిస్థితి బాగా డల్ అయింది. మరి రకుల్ ప్రీత్ సింగ్ అయినా.. ఈ ట్రెండ్ కి బ్రేక్ వేస్తుందేమో చూడాలి
సెంటిమెంట్లదేముంది.. గట్టిగా గాలివీస్తే కొట్టుకుపోతాయ్ అనుకునేవారు మాత్రం.. నిన్న బ్రాండ్ లాంచ్ లో రకుల్ హాట్ లుక్స్ చూసి లొట్టలేస్తున్నారు. అది సంగతి.