Begin typing your search above and press return to search.

హాట్ లేడీ టెన్షన్ తగ్గించిన దిండు

By:  Tupaki Desk   |   5 Dec 2016 5:30 AM GMT
హాట్ లేడీ టెన్షన్ తగ్గించిన దిండు
X
ఒక్కోసారి హీరోయిన్లకు తమ డ్రస్సులతో అనుకోని కష్టాలు ఎదురవుతాయి. అస్సలు వేసుకున్న డ్రస్సు ఎక్కడైనా మొరాయిస్తే మాత్రం.. దానిని వార్డురోబ్ మాల్ ఫంక్షన్ అంటారు. కాని ఒక్కోసారి డ్రస్సు బాగానే ఉన్నప్పటికీ.. దాని పరిమాణం కాస్త ఇబ్బంది పెట్టేదిగా ఉంటుంది. అలాంటప్పుడు హీరోయిన్లు ఎంతటి అనీజినెస్ కు గురవుతారు.. నిన్న ''ధృవ'' ప్రీ రిలీజ్ ఈవెంట్లో రకుల్ ప్రీత్ ను చూస్తే అర్ధమైంది.

తయ్-హయ్ స్లిట్ ఉన్న డ్రస్సును వేసుకుని.. హాలీవుడ్ భామల తరహాలు తన పిక్కల సౌందర్యాలను ఆరబోసింది రకుల్. అయితే అక్కడివరకు బాగానే ఉంది కాని.. అమ్మడుకి అక్కడ సోఫాలో కూర్చున్నప్పుడు మాత్రం.. మరీ తన తొడలను అలా ఎక్సపోజ్ చేయడం ఇబ్బందిగానే అనిపించింది. ముందులో ఇబ్బందిపడుతూనే ఫోటోగ్రాఫర్లకు ఫోజులిచ్చింది రకుల్. చేత్తో కవర్ చేసుకుంటూ ఒక రేంజులో ఇబ్బందికి గురైంది. కట్ చేస్తే.. ఆమె టీమ్ లోని ఒకరు మాంచి ఐడియా ఇచ్చారు.

పక్కనే సోఫాలో ఉన్న చిన్న దిండును తీసుకుని చక్కగా కవర్ చేస్కో అంటూ సలహా చెప్పడంతో.. అమ్మడు వెంటనే ఆ చిన్న పైజ్ పిల్లోతో తన అందాలను దాచేసింది. ప్రశాంతంగా ఇక మిగతా ప్రోగ్రామ్ అంతా కూర్చొని ఎంజాయ్ చేసింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/