Begin typing your search above and press return to search.
టచ్ చేశావ్ రకుల్.. గుర్తెట్టుకుంటాం!!
By: Tupaki Desk | 5 Dec 2016 10:30 PM GMTతన హాట్ లుక్స్ తో ఎప్పుడూ మెల్ట్ చేసే రకుల్.. తన కూల్ మాటలతో అప్పుడప్పుడూ టచ్ చేస్తూ ఉంటుంది. ఒకప్పుడు డెడికేషన్ ఉన్న హీరోయిన్ అంటూ మిల్కీ బ్యూటి తమన్నాను ఎలా పొగిడేశేవారో.. ఇప్పుడు డిసిప్లయిన్డ్ హీరోయిన్ అంటూ అందరూ రకుల్ ను కూడా అలాగే పొగిడేస్తున్నారు. అయితే ఇక్కడే ఇంకో విషయం చెప్పాలి.
గత రాత్రి ధృవ ప్రీ-రిలీజ్ ఈవెంట్లో మాట్లాడిన రకుల్.. ఆద్యంతం తెలుగులోనే మాట్లాడి అలరించింది. అంతేకాదు ఒక అద్భుతమైన స్టేట్మెంట్ కూడా ఇచ్చింది. ''నేను ఇప్పుడు అందరితోనూ తెలుగులోనే మాట్లాడుతున్నాను. త్వరలో ఇంకా బాగా మాట్లాడుతా. నన్ను మీరందరూ ఒక తెలుగమ్మాయిలానే గుర్తు పెట్టుకోవాలని నా ఆకంక్ష'' అంటూ ఒక బారీ స్టేట్మెంట్ ఇచ్చింది రకుల్. కేవలం 'అందారకీ నమస్కారం' అంటూ ఒక మాట చెప్పేసి.. ఏళ్ల తరబడి తెలుగు సినిమాల్లో కోట్లలో దండుకున్నా కూడా.. కాజల్ త్రిష వంటి భామలు తెలుగులో మాత్రం మాట్లాడలేదు. రకుల్ అయితే తెలుగులో మాట్లాడటమే కాదు.. తెలుగమ్మాయినే అంటోంది. ''నేను పంజాబి ఫ్యామిలీలో పుట్టినా కూడా.. హైదరాబాదులో ఉంటూ తెలుగమ్మాయి అయిపోతున్నా'' అంటూ సెలవిచ్చింది.
సర్లేండి ఇలాంటి స్టేట్మెంట్లపై జనాలు ఏమని పంచ్ వేస్తారో తెలుసుగా.. యాంకర్ సుమ అలాంటి పంచ్ వేసేసింది. ''మాకు ఇలా చెబుతున్నావ్.. మరి తమిళంలో కూడా సినిమాలు చేస్తున్నావ్ గా.. అక్కడ తమిళమ్మాయ్ అంటావా??'' అని అడిగింది. ''అబ్బే లేదండి. నేను తెలుగమ్మాయినే. మీరే చూడండి'' అంటూ తడుంకోకుండా మరోసారి చెప్పింది రకుల్. ఆ దెబ్బతో మన హార్ట్ ను టచ్ చేసింది కదూ ఈ భామ. నిన్ను గుర్తుపెట్టుకుంటాం రకుల్.. ఆల్ ది బెస్ట ఫర్ ధృవ!!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/