Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరీ: లాక్మే ఫాషన్ వీక్.. పాప క్యాట్ వాక్

By:  Tupaki Desk   |   13 Feb 2020 6:45 AM GMT
ఫోటో స్టోరీ: లాక్మే ఫాషన్ వీక్.. పాప క్యాట్ వాక్
X
ఉత్తారాది నుంచి దిగుమతై ఇక్కడ టాలీవుడ్ లో సత్తా చాటే భామలకు కొదవే లేదు. రకుల్ ప్రీత్ సింగ్ కూడా అలాగే తన సత్తా చాటింది. దాదాపుగా టాప్ హీరోలందరితోనూ నటించింది. అయితే వరస ఫ్లాపులతో ఈమధ్య టాలీవుడ్ లో జోరు కొంచెం తగ్గింది కానీ సోషల్ మీడియాలో మాత్రం రివర్స్ లో జోరు పెరిగింది. ఫోటో షూట్లు చెయ్యడమే కాదు.. ఫ్యాషన్ ఈవెంట్లలో పాల్గొంటూ మోడలింగ్ భామలకు గట్టి పోటీ ఇస్తోంది.

ఈమధ్య ముంబైలో జరిగిన లాక్మె ఫ్యాషన్ వీక్ లో పాల్గొన్న రకుల్ ఒక డిజైనర్ డ్రెస్ ధరించి హొయలొలికిస్తూ క్యాట్ వాక్ చేసింది. వైట్ కలర్ షర్టు..త్రీ ఫోర్త్ బ్లాక్ ప్యాంట్ ధరించి.. మెడకేమో టై ధరించి ఎంతో కాన్ఫిడెంట్ గా నడుచుకుంటూ వచ్చి చూపరులను కట్టిపడేసింది. ఈ లేడీ బాస్ లాంటి డ్రెస్ కు తగిన మేకప్.. చెవి కమ్మలు ధరించి అందరినీ ఆకట్టుకుంది. ఫిట్ నెస్ అంటే చాలామంది చెవులు కోసుకుంటారు. కానీ రకుల్ రెండాకులు ఎక్కువ. తన రెండు చెవులతో పాటుగా పక్కన ఉండేవారి చెవులను కసాబిసా కోసి పడేసే భామ కాబట్టి యమా ఫిట్టుగా ఉంటుంది. అందుకే ఈ డ్రెస్సులో ఒరిజినల్ మోడల్స్ కంటే ఒరిజినల్ గా కనిపిస్తోంది.

తెలుగులో ప్రస్తుతం ఈ అమ్మడికి అవకాశాలేం లేవు కానీ ఇతర భాషలలో మాత్రం జోరు తగ్గలేదు. కమల్ హాసన్ - శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న క్రేజీ ఫిలిం 'ఇండియన్ 2' లో నటిస్తోంది. తమిళంలో శివ కార్తికేయన్ హీరోగా తెరకెక్కే మరోచిత్రంలో నటిస్తోంది. హిందీలో కాశ్వీ నాయర్ దర్శకత్వంలో రూపొందుతున్న మరో మూవీలో కూడా హీరోయిన్ గా యాక్ట్ చేస్తోంది.