Begin typing your search above and press return to search.
అమెరికాలో డాలర్లు కురిపించింది
By: Tupaki Desk | 4 July 2015 7:30 PM GMTసగటు ప్రేక్షకుడు ఏం కోరుకుని థియేటర్‌కి వెళతాడు? ఓ మంచి సినిమా చూడాలి. అభిమాన హీరోని, అందాల కథానాయికని తనివితీరా తెరపై చూడాలి. దాని కోసం మామూలు థియేటర్‌లో అయితే రూ.50 వరకూ, మల్టీప్లెక్సుల్లో అయితే రూ.250 వరకూ పెట్టి టిక్కెట్టు కొనుక్కోవడానికైనా సిద్ధం. అయితే సరిగ్గా ఇదే ఫార్ములాని అమెరికాలోని 'నాట్స్'లో ఉపయోగించి భారీ బిజినెస్ చేశారు నిర్వాహకులు.
ప్రస్తుతం డెట్రాయిట్‌లో తానా సభలు, లాస్ ఏంజిల్స్‌లో నాట్స్ సంబరాలు సాగుతున్నాయి. అయితే నాట్స్ సంబరాలకు సంబంధించిన టిక్కెట్లు కొనేవాళ్లు లేక షో వెలవెలబోయింది. అయితే ఈ ఉత్సవాలకు రకూల్‌ప్రీత్, తాప్సీ లాంటి గ్లామర్ యాడవుతోందంటూ చేసిన ప్రచారంతో చివరి నిమిషంలో అంటే సరిగ్గా ఉత్సవాల ప్రారంభానికి ముందు బ్యాలెన్స్ టిక్కెట్లన్నీ హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయని చెబుతున్నారు. చివరి నిమిషంలో యుఎస్ ఎంబసీలో వీసా సమస్య సమసిపోయి రకూల్‌కి లైన్ క్లియరైంది. ఇక విమానం ఎక్కేసింది అన్న ప్రచారంతో టిక్కెట్ల అమ్మకాల్లో ఊపందుకుంది. ముఖ్యంగా యువకథానాయిక రకూల్‌కి ఎన్నారై కుర్రాళ్లలో వీరాభిమానులున్నారు. రకూల్ అంటే పడిచచ్చేంతటి క్రేజు ఉంది. అందుకే చివరి నిమిషంలో వందల టిక్కెట్లు అమ్ముడుపోయాయని నిర్వాహకులు చెబుతున్నారు. విదేశాల్లోనూ రకూల్ ఫీవర్ ఆ రేంజులో ఉందన్నమాట!