Begin typing your search above and press return to search.
ఆస్ట్రాలజి కీ జై అంటున్న హీరోయిన్లు
By: Tupaki Desk | 10 July 2016 7:02 AM GMTఇండస్ట్రీలోకి వచ్చే వాళ్లు.. పోయే వాళ్లు చాలామంది హీరోయిన్స్ ఉంటారు కానీ.. పాతుకుపోయేవాళ్లు మాత్రం కొంతమందే కనిపిస్తారు. ఈ తరం టాలీవుడ్ హీరోయిన్స్ గురించి మాట్లాడుకుంటే.. రకుల్ ప్రీత్ సింగ్ - రాశి ఖన్నాలను రాబోయే కాలానికి కాబోయే స్టార్ హీరోయిన్స్ అనుకుంటున్న విషయం తెలిసిందే. అలాంటి ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు కలిసి.. ఒకే ఈవెంట్ లో కనిపించారు.
హరిత హారం పేరుతో హైద్రాబాద్ కేబీఆర్ పార్క్ లో నిర్వహించిన మొక్కలు నాటే కార్యక్రమంలో.. రకుల్ - రాశిలే ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇక్కడ చెప్పుకోవాల్సిన అసలు పాయింట్ ఏంటంటే.. ఈ కార్యక్రమంలో రకుల్ చేతికి కనిపించిన ఉంగరం. కనక పుష్య రాగంతో చేసిన ఉంగరాన్ని కుడి చేతికి ధరించిన రకుల్ ప్రీత్ సింగ్.. ఆ విషయాన్ని చెప్పేందుకు ఏ మాత్రం మొహమాట పడలేదు. అసలైతే ఈ రింగ్ చేతికి పెట్టుకున్నాక.. తన కెరీర్ రేంజ్ మారిపోయిందని ఆమె విపరీతంగా నమ్మేస్తుంది. నమ్మకాలు సెంటిమెంట్లను మిగిలిన వాళ్లు కామెంట్లు చేయడం కష్టం కానీ.. ఈ ఆస్ట్రాలజీ పిచ్చి ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లలో కనిపిస్తుంది. ఫస్టు డే షూటింగుకు కాజల్ వైట్ డ్రస్సు వేసుకురావడం. తమన్నా తన పేరులో 'హెచ్' యాడ్ చేసుకోవడం. లిస్టు పెద్దదే.
సదరన్ బ్యూటీ శృతి హాసన్.. వరుసగా ఓ రెండు సంవత్సరాలు బయట ఎక్కడ కనిపించినా కూడా రుద్రాక్షతోనే దర్శనమిచ్చింది. ఆమె మెడలో ఉన్న రుద్రాక్షే ఎప్పుడూ హైలైట్ అయిపోయేది. గతంలో సమంత రాహు కేతు పూజ చేయించుకున్న విషయం అందరికీ తెలుసు. ఆస్ట్రాలజీ నమ్ముకునే పైకొచ్చారని కాదు కానీ.. ఆ రేంజ్ కాపాడుకోవడానికి మాత్రం నమ్మకాలను నమ్మక తప్పని పరిస్థితి..అంతే.