Begin typing your search above and press return to search.

ఆ హీరోయిన్‌ కు రకుల్‌ బ్రేకప్‌ చెప్పిందా?

By:  Tupaki Desk   |   29 Sep 2018 5:49 AM GMT
ఆ హీరోయిన్‌ కు రకుల్‌ బ్రేకప్‌ చెప్పిందా?
X
టాలీవుడ్‌ హీరోయిన్స్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ - రాశిఖన్నా - లావణ్య త్రిపాఠిల మద్య చాలా సన్నిహిత సంబంధాలు ఉండేవి. సంవత్సరం క్రితం వరకు కూడా వీరు చాలా తరుచుగా కలుస్తూ ఉండేవారు. ఈ ముగ్గురు పార్టీలకు - ఫంక్షన్‌ లకు కలిసి వెళ్తూ ఎంజాయ్‌ చేసేవారు. ఫొటోలకు ఫోజ్‌ లు ఇస్తూ తమ అభిమానులకు కనువిందు చేస్తూ ఉండేవారు. కాని అదంతా గతం, ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఈ ముగ్గురు ఎవరికి వారే అన్నట్లుగా విడిపోయారు అంటూ టాక్‌ వినిపిస్తుంది.

ఇండస్ట్రీలో మంచి స్నేహితులుగా పేరు తెచ్చుకున్న ఈ ముగ్గురిలో ముఖ్యంగా రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ - రాశిఖన్నాలు విడిపోయారని - వీరి ఫ్రెండ్‌ షిప్‌ బ్రేకప్‌ అయ్యింది అంటూ సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ఆ కారణంగానే వీరిద్దరు ఈమద్య కలుసుకోవడం లేదు అంటూ సోషల్‌ మీడియాలో టాక్‌ వినిపిస్తుంది. క్లోజ్‌ ఫ్రెండ్స్‌ గా నిలిచిన వీరు ఎందుకు ఇలా విడిపోయారు అంటూ రకరకాల చర్చలు జరుగుతున్నాయి.

ప్రస్తుతం రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ తెలుగు కంటే తమిళం మరియు హిందీల్లో ఎక్కువ ఫోకస్‌ పెట్టింది. మరో వైపు రాశిఖన్నా మాత్రం తెలుగులోనే వరుసగా చిత్రాలు చేస్తోంది. ఆ కారణంగానే ఇద్దరు కలిసే సమయం చిక్కడం లేదని - అంతే తప్ప ఇద్దరి మద్య ఎలాంటి విభేదాలు రాలేదని - ఇద్దరు ఇప్పటికి కూడా మంచి స్నేహితులుగానే ఉన్నారని వారి సన్నిహితులు చెబుతున్నారు.