Begin typing your search above and press return to search.
బాలల దినోత్సవం: రకుల్.. రాశి విషెస్
By: Tupaki Desk | 14 Nov 2018 7:55 PM GMTనవంబర్ 14 చాచా నెహ్రూ పుట్టిన రోజు. అయనకు పిల్లలంటే ఇష్టం కాబట్టి అయన పుట్టిన రోజును మనం బాలల దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఈ బాలల దినోత్సవం సందర్భంగా ఇద్దరు టాలీవుడ్ బ్యూటీలు ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళిపోయారు. అందులో ఒకరు రకుల్ ప్రీత్ సింగ్ కాగా మరొకరు.. రాశి ఖన్నా.
రాశి ఖన్నా తన చిన్ననాటి ఫోటో ఒకదాన్ని ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసి ఇలా క్యాప్షన్ ఇచ్చింది. "మీ పిల్లలను అద్భుతమైన జీవితం గడపడం కోసం కష్టపడాలని కోరద్దు. అలాంటి జీవితం గొప్పగా అనిపించొచ్చు కానీ అది మీ మూర్ఖత్వమే. దానిబదులు చిన్న చిన్న విషయాల్లో ఎలా ఆనందించాలనేది నేర్పించండి. ఒక టమోటా తినడం. ఒక ఆపిల్ ను టేస్ట్ చేయడం.. లాంటివి. పెంపుడు జంతువులు ..మనకు దగ్గర మనుషులు మనకు దూరమైనప్పుడు ఎలా బాధపడాలో నేర్పించండి. ఒక్క హగ్ తో హద్దుల్లేని ఆనందం ఎలా పొందాలో కూడా అలవాటు చెయ్యండి. వారిలో సాధారణమైన మనిషిని జీవించేలా చూడండి. ఎందుకంటే అంత ఎక్స్ట్రా ఆర్డినరీ జనాలు వారి లైఫ్ సంగతి వారు చూసుకోగలరు. బాలల దినోత్సవం సందర్భంగా కీర్తి శేషులైన మా తాతగారితో నేను దిగిన ఫోటో ఇది... నాకు జీవితం లో ఇన్స్పిరేషన్ ఇచ్చిన వారిలో ఒకరు. నాకు జీవించడం అంటే ఏంటో నేర్పించిన వారు.. నాలోని చిన్న పాపను ఎప్పుడూ గుర్తించడం ఎలానో నేర్పిన వారు."
ఇక మరో హీరోయిన్ రకుల్ కూడా బాలల దినోత్సవం సందర్భంగా తన చిన్ననాటి ఫోటో పోస్ట్ చేసింది. బేబీ బ్రూస్ లీ లాగా తన కాలిని పైకెత్తి ఒక కిక్ ఇస్తోంది. దాంతోపాటు ఒక క్యాప్షన్ ఇచ్చింది. "మీలో ఉండే చిన్నపిల్లను ఎప్పుడూ చంపేయెద్దు. హ్యాపీ చిల్ద్రెన్స్ డే." ఎప్పుడూ బ్యూటీలలోని పైనుండే బ్యూటీని చూడడమేనా.. మనసులోని బ్యూటీని కనీసం ఒక్కసారైనా చూస్తే బాగుంటుంది కదా....!