Begin typing your search above and press return to search.

రకుల్ తమ్ముడిని వద్దనేశారా!?

By:  Tupaki Desk   |   28 Dec 2016 7:30 PM GMT
రకుల్ తమ్ముడిని వద్దనేశారా!?
X
టాలీవుడ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడు అమన్ ప్రీత్ సింగ్ కూడా తెరంగేట్రానికి రెడీ అవుతున్నాడని ముందే చెప్పేసుకున్నాం. అయితే.. ఇతనికి హీరో కంటే విలన్ పాత్రలపైనే మక్కువ ఎక్కువట. అందుకే రీసెంట్ గా విలన్ రోల్ కోసం ఇతగాడు ఓ ప్రయత్నం చేసి విఫలం అయినట్లు తెలుస్తోంది.

అడివి శేష్ హీరోగా రూపొందే ఓ చిత్రంలో విలన్ పాత్ర కోసం తాజాగా ఆడిషన్స్ జరిపారు. దీనికి రకుల్ తమ్ముడు కూడా ఆసక్తిగా హాజరయ్యాడు. ఆడిషన్ కూడా జరిగిందట. స్కిల్స్ ఎంత బాగున్నా.. అమన్ ను ఆ రోల్ కు తీసుకోవడం సాధ్యం కాదనే విషయం తేలిపోయిందని తెలుస్తోంది. ఇందుకు కారణం.. అతనికి హీరో లుక్స్ తప్ప విలన్ లుక్స్ లేవని చెప్పడం విషయం. మరీ ఇంత సాఫ్ట్ గా హీరో లుక్స్ తో ఉన్న అమన్ ప్రీత్ ను విలన్ పాత్ర చేయించడం సాధ్యం కాదని సాయికిరణ్ అడివి భావించాడట.

ఈ విషయం తెలిసిన అమన్ ప్రీత్ సింగ్.. తనే స్వచ్ఛందంగా తప్పుకున్నట్లు చెబుతున్నారు. ఒకేసారి అంతే.. మరీ మంచిగా కనిపించడం కూడా.. ఇలాంటి సమస్యలే వస్తాయ్ మరి!


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/