Begin typing your search above and press return to search.
రకుల్ లో కూడా ఆ యాంగిల్ ఉంది
By: Tupaki Desk | 14 Nov 2015 5:21 AM GMTమొన్ననే అందాల సమంత తన అవయవాల్ని దానం చేసిన విషయం గురించి తుపాకి ప్రస్థావించింది. మన టాలీవుడ్ సెలబ్రిటీల్లో ఎందరో అవయవదానం చేసినవారున్నారు. కాజల్ - శ్రుతిహాసన్ - హన్సిక - అనుష్క వంటి అందాల భామలు తమవంతుగా సమాజానికి, అభాగ్య జీవులకు ఏదైనా సాయం చేయాలన్న తపనతో సైలెంటుగా మంచి పనులు చేస్తూనే ఉన్నారు. చేసిన పనికి ప్రచారం కోరుకోలేదు కాబట్టి అంతగా ప్రచారం రాలేదు కానీ బాలికల చదువుల కోసం - పునరావాసం కోసం - అనాధల కోసం ఏదో ఒకటి చేస్తూనే ఉన్నారు వీళ్లంతా.
అందుకే ఇంతమంది ఇన్ని రకాలుగా సామాజిక సేవలో పాలు పంచుకుంటున్నారు కాబట్టి .. ఇంత బిజీలోనూ మంచి గురించి తపిస్తున్నారు కాబట్టి అవన్నీ తనని ప్రేరేపించినట్టున్నాయి. అందాల రకూల్ ప్రీత్ సింగ్ ఓ వైపు ఎంతో బిజీ షెడ్యూల్స్ తో బిజీగా ఉన్నా.. నిన్నటిరోజున అపోలో - క్యూర్ ఫౌండేషన్ ఏర్పాటు చేసిన క్యాన్సర్ అవేర్ నెస్ ప్రోగ్రామ్ లో పాల్గొంది. ఇప్పుడున్న అత్యాధునిక టెక్నాలజీతో ఎలాంటి క్యాన్సర్లనయినా జయించవచ్చు.. అని ప్రపంచానికి చాటే ప్రోగ్రామ్ లో నేను సైతం అంటూ పాల్గొంది రకూల్. అప్పటికే క్యాన్సర్ మహమ్మారిని జయించిన చిన్న పిల్లలతో కలిసి కాసేపు ఆటలాడుకుంది. అందరినీ ఎంతో ఆనందంలో ముంచేసింది.
ఈ సందర్భంగా రకూల్ కొన్ని ఫోటోగ్రాఫ్స్ కి ఫోజులిచ్చింది. నాన్నకు ప్రేమతో - సరైనోడు సినిమాలతో ఏకకాలంలో బిజీగా ఉన్న రకూల్ ఇలా మంచి మనసు చేసుకుని ఓ మంచి కార్యక్రమానికి విచ్చేసినందుకు అభిమానులు ఎంతో అభినందించారు. రకూల్ మనసుల్ని జయించింది అంటూ కాంప్లిమెంట్స్ ఇచ్చారు. ఈ బ్రూస్ లీ బ్యూటీలో కూడా ఇలాంటి హ్యుమానిటేరియన్ యాంగిల్ ఉందని అందరూ ఆనందిస్తున్నారు.