Begin typing your search above and press return to search.
రిలీజ్ డేట్ కన్ఫాం చేస్తున్న రకుల్
By: Tupaki Desk | 17 Dec 2015 4:21 AM GMTఎన్టీఆర్ హీరోగా సుకుమార్ దర్శకత్వం వహించిన నాన్నకు ప్రేమతో ఎప్పుడు రిలీజవుతుంది? ఈ విషయంలో క్లారిటీ మిస్సయ్యింది. చిత్రయూనిట్ అధికారికంగా ఎట్టి పరిస్థితిలో 2016 సంక్రాంతికి వచ్చేస్తున్నాం అని ప్రకటించింది. అయితే నిన్నటిరోజున సంక్రాంతి బరిలో అబ్బాయ్ లేడు - బాబాయ్ (డిక్టేటర్ ) మాత్రమే వస్తున్నాడు... అన్న వార్త వినిపించింది. కానీ ఇప్పుడు మరోసారి అధికారికంగా ట్విట్టర్ ద్వారా కథానాయిక రకూల్ ప్రీత్ సింగ్ మరోసారి రిలీజ్ తేదీని కన్ఫమ్ చేసింది.
ఎట్టి పరిస్థితిలో సంక్రాంతి బరిలోనే వచ్చేస్తున్నాం. జనవరి 13 న మా సినిమాని రిలీజ్ చేసేందుకు సన్నాహాలు సాగుతున్నాయి.. అని చెప్పింది రకుల్. ఇటీవలే నాన్నకు ప్రేమతో చిత్రయూనిట్ స్పెయిన్ నుంచి వచ్చింది. వస్తూనే నిర్మాణానంతర పనులు మొదలు పెట్టింది. ప్రస్తుతం ఆ పనులన్నీ జెట్ స్పీడ్ తో సాగుతున్నాయి. మరోవైపు దేవీశ్రీ తన తండ్రి అంత్యక్రియలు సహా ఇతరత్రా కార్యక్రమాలు పూర్తి చేసుకునే హడావుడిలో ఉన్నారు. ఆ పనులు పూర్తి చేసి తిరిగి నాన్నకు ప్రేమతో బ్యాలెన్స్ వర్క్ పూర్తి చేస్తాడు. అనూహ్య ఘటన తర్వాత ఆలస్యం అవుతుందనుకున్నారు కానీ, ఏదోలా పట్టుదలగా ఈ చిత్రాన్ని సంక్రాంతికే తీసుకురావాలని సుక్కూ ఆలోచిస్తున్నట్టు అర్థమవుతోంది.
ఇదంతా రకూల్ అదృష్టం. ఈ అమ్మడు తనకి ఓ బ్రేక్ కావాలన్న ఉత్సాహంలో కనిపిస్తోంది. అది నాన్నకు ప్రేమతో సినిమాతో వస్తుంది అని ఆలోచిస్తోంది. ఈ సినిమా తర్వాత బన్ని సరసన నటించిన సరైనోడు లోనూ రకూల్ నాయికగా నటిస్తోంది. ఈ రెండు సినిమాలు తన భవితవ్యాన్ని తేల్చేసే సినిమాలు. అందుకే ఇంత ఎగ్జయిటింగ్ గా ఉంది.