Begin typing your search above and press return to search.

ఆ లగ్జరీ వెడ్డింగ్ లో రకుల్ చిందులు??

By:  Tupaki Desk   |   13 Nov 2016 3:58 AM GMT
ఆ లగ్జరీ వెడ్డింగ్ లో రకుల్ చిందులు??
X
గాలి జనార్ధన రెడ్డి కూతురు పెళ్లి.. అటు కర్నాటక.. ఇటు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతోంది. ఈ దశాబ్దంలో అత్యంత భారీగా బ్రాహ్మణి వివాహ వేడుక జరగనుందని ఇప్పటికే అందరికీ తెలుసు. ఈ పెళ్లిని అత్యంత ఆకర్షణీయంగా మార్చేందుకు గాలి మరిన్ని ఐడియాలు వేస్తున్నారట.

కూతురు పెళ్లిలో హీరోయిన్లతో సంగీత్ లాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని భావించి.. కొందరు బాలీవుడ్ భామలను అప్రోచ్ అయినట్లు తెలుస్తోంది. అయితే.. వీరి నుంచి రియాక్షన్ రాకపోవడంతో.. సౌత్ భామలనే సంప్రదించి పైనల్ చేసుకున్నారట. టాలీవుడ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ తోపాటు.. సౌత్ అంతా గుర్తింపు ఉన్న ప్రియమణి కూడా.. గాలి వారి కూతురు పెళ్లిలో డ్యాన్స్ చేసేందుకు అంగీకరించారని టాక్.

ఒక్క ఈవెంట్ లో డ్యాన్స్ కోసం భారీ మొత్తాన్ని ఆఫర్ చేశారని.. 2-3 సినిమాలు చేస్తే కానీ లభించనంత రెమ్యూనరేషన్ ని ఒక్క డ్యాన్స్ కోసమే ఇవ్వజూపారన్నది టాక్. అందుకే రకుల్.. ప్రియమణిలు మొగ్గు చూపారట. ప్రస్తుతం ధృవ పాట షూటింగ్ కోసం థాయ్ ల్యాండ్ లో ఉన్న రకుల్.. పెళ్లి వేడుక నాటికి ఇండియా రానుందట.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/