Begin typing your search above and press return to search.

సినిమాల ఛాన్స్‌ లు తగ్గడంతో ఎంబీఏ చేస్తుందా?

By:  Tupaki Desk   |   18 Jun 2020 11:30 PM GMT
సినిమాల ఛాన్స్‌ లు తగ్గడంతో ఎంబీఏ చేస్తుందా?
X
రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ రెండు మూడు సంవత్సరాలు టాలీవుడ్‌ కోలీవుడ్‌ లో మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌ గా వెలుగు వెలిగిన విషయం తెల్సిందే. గత రెండు సంవత్సరాలుగా ఈమెకు ఆఫర్లు మెల్ల మెల్లగా తగ్గుతూ వస్తున్నాయి. మళ్లీ షూటింగ్స్‌ ప్రారంభం అయితే కొత్త ఆఫర్లు వస్తాయో రావో తెలియని పరిస్థితి. సినిమాలపై మెల్ల మెల్లగా నమ్మకం తగ్గించుకుంటున్న రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ మెల్లగా వ్యాపారం వైపు మెగ్గు చూపుతున్నట్లుగా ఆమె సన్నిహితుల ద్వారా తెలుస్తోంది.

వ్యాపారంతో పాటు ఎంబీఏ ను కూడా చేయాలని రకుల్‌ నిర్ణయించుకుంది. ప్రస్తుతం విదేశీ యూనివర్శిటీ నుండి ఎంబీఏ పట్టా కోసం ప్రయత్నాలు చేస్తుందట. ఇటీవలే ముంబయి నుండి తన తల్లిదండ్రులు ఉన్న దిల్లీకి వెళ్లింది. అక్కడ తన తల్లిదండ్రులతో టైం స్పెండ్‌ చేస్తున్న రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఒక ఇంగ్లీష్‌ దిన పత్రికతో మాట్లాడినది. ఈ సందర్బంగా ప్రస్తుతం టైంను ఎలా స్పెండ్‌ చేస్తున్నది చెప్పుకొచ్చింది.

ఎక్కువ సమయంను కుటుంబ సభ్యులతో గడుపుతూ తన యూట్యూబ్‌ ఛానెల్‌ పనులు చూసుకుంటుందట. ఇదే సమయంలో ఎంబీఏ కూడా చేస్తున్నట్లుగా పేర్కొంది. హీరోయిన్‌ గా ఇన్నాళ్లు చేసి చదువుకు దూరం అయిన ఇన్నాళ్లకు కూడా మళ్లీ ఆమెకు ఎంబీఏ చేయాలనే ఆలోచన రావడం నిజంగా అభినందనీయం అంటూ నెటిజన్స్‌ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.