Begin typing your search above and press return to search.
రకుల్ పాపకు ఆ మాటంటే అస్సలు నచ్చదట!
By: Tupaki Desk | 4 May 2022 2:30 AM GMTఢిల్లీ సోయగం రకుల్ ప్రీత్ సింగ్ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. తనదైన టాలెంట్ తో అంచలంచలుగా ఎదుగుతూ తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న ఈ భామ.. ప్రస్తుతం తన పూర్తి ఫోకస్ ను బాలీవుడ్ పైనే పెట్టింది. వరుస ఆఫర్లను దక్కించుకుంటూ అక్కడే సెటిల్ అవ్వాలని విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా రకుల్ నటించిన హిందీ చిత్రం 'రన్ వే 34' ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
2015లో జరిగిన ఓ యదార్ధ సంఘటన ఆధారంగా ఈ మూవీని రూపొందించారు. బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్ ఇందులో హీరోగా నటించగా..బిగ్‌బి అమితాబ్ బచ్చన్ ఈ చిత్రంలో ఓ కీలకమైన పాత్రను పోషించారు. అజయ్ దేవగణ్ స్వీయదర్వకత్వంలో నిర్మితమైన ఈ చిత్రం భారీ అంచనాల నడుమ ఏప్రిల్ 29న విడుదలై యావరేజ్ టాక్ సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమాకు ప్రమోషన్స్ మాత్రం వేరె లెవల్ లో చేశారు మేకర్స్.
ఇందులో భాగంగానే రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రకుల్ ప్రీత్ సింగ్.. సినిమాకు సంబంధించి ఎన్నో విశేషాలను పంచుకుంది. ఈ క్రమంలోనే ఒకేసారి ఇద్దరు పెద్ద స్టార్లతో పని చేయడం నటిగా కష్టమనిపించిందా..? అనే ప్రశ్న రకుల్ కు ఎదురైంది.
అయితే ఆ ప్రశ్నకు రకుల్ చెప్పిన సమాధానం నెట్టింట వైరల్ గా మారింది. ఇంతకీ ఆమె ఏం చెప్పిందంటే.. 'వాస్తవానికి కష్టం అనే మాటే నాకు అస్సలు నచ్చదు. నాకంటే ప్రతిభావంతులైన నటులతో కలిసి పని చేస్తున్నప్పుడు నాకు ఎంతో ఉత్సాహంగా అనిపిస్తుంది.
ఇక ఇద్దరు పెద్ద స్టార్లతో కలిసి నటిస్తున్నాన్నంటే నా ఎనర్జీ డబుల్ అవుతుంది. దాంతో నేను మరింత మెరుగ్గా నటిస్తా.' అంటూ చెప్పుకొచ్చింది. మొత్తానికి ఎంత పెద్ద స్టార్స్ తో అయినా నేను వర్క్ చేయగలనని, తనకు ఎటువంటి భయంగానీ, కష్టంగానీ ఉండదని రకుల్ పాప చెప్పకనే చెప్పేసింది.
కాగా, రకుల్ ఇతర ప్రాజెక్ట్స్ విషయానికి వస్తే.. హిందీలో 'ఛత్రీవాలీ', 'మిషన్ సిండెరెల్లా', అజయ్ దేవగణ్ తో 'థ్యాంక్ గాడ్', ఆయుష్మాన్ ఖురానాతో 'డాక్టర్ జీ' చిత్రాల్లో నటిస్తోంది. అలాగే '31 అక్టోబర్ లేడీస్ నైట్' అనే మూవీకి సైన్ చేసింది. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతుందీ సినిమా. వీటితో పాటు మరిన్ని ప్రాజెక్ట్స్ కూడా రకుల్ చేతిలో ఉన్నాయి.