Begin typing your search above and press return to search.

రకుల్‌ డబుల్‌ ఫొటో

By:  Tupaki Desk   |   21 Jan 2015 7:34 AM GMT
రకుల్‌ డబుల్‌ ఫొటో
X
ద్విపాత్రాభినయం చేయడం.. ఏ నటుడికైనా, నటికైనా చాలా ప్రత్యేకం. కెరీర్లో ఒక్కసారైనా అలాంటి అవకాశం దక్కుతుందా అని ఎదురు చూస్తుంటారు. హీరోలకు ఈ విషయంలో బాగానే అవకాశాలు వస్తాయి కానీ.. హీరోయిన్లకు మాత్రం అరుదుగా మాత్రమే అలాంటి ఛాన్సు దొరుకుతుంది. ఐతే హీరోయిన్‌గా అరంగేట్రం చేసిన రెండేళ్లకే ఈ అవకాశం రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ తలుపు తట్టినట్లు సమాచారం. కిక్‌-2లో రకుల్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు చెబుతున్నారు.

సురేందర్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పల్లెటూరి అమ్మాయిగా, సిటీ అమ్మాయిగా రెండు విభిన్నమైన పాత్రలు పోషిస్తున్నట్లు రకుల్‌ చెప్పింది. ఐతే ఇది ద్విపాత్రాభినయమేనా అన్న విషయం మాత్రం కన్ఫమ్‌ చేయలేదు. ఈ పాత్రల గురించి ఇంతకుమించి ఏమీ చెప్పలేనని.. మిగతా విశేషాలు తెరమీదే చూడాలని చెప్పింది. తన కెరీర్లో కిక్‌-2 ప్రత్యేకమైన సినిమాగా మిగిలిపోతుందని రకుల్‌ చెప్పింది. ప్రస్తుతం టాలీవుడ్‌ల అత్యంత బిజీగా ఉన్న హీరోయిన్లలో రకుల్‌ ఒకరు. రామ్‌తో పండగచేస్కో, ఎన్టీఆర్‌తో ఓ సినిమా చేస్తూనే హిందీలోనూ రెండు సినిమాల్లో నటిస్తోంది. కిక్‌-2 ఈ ఏడాది వేసవిలో విడుదలవుతుంది.