Begin typing your search above and press return to search.
రకుల్ రేంజు అమీర్ రేంజు అంట!
By: Tupaki Desk | 26 May 2019 4:47 PM GMTకెరియర్ ఆరంభంతో పోలిస్తే రకుల్ యాటిట్యూడ్ లో ఏదో ఛేంజ్ కనిపిస్తోంది. ఒకప్పుడు `వెంకటాద్రి ఎక్స్ ప్రెస్` రకుల్ వేరు. ఇప్పుడు `దేదే ప్యార్ దే` రకుల్ వేరు. అంతెందుకు అప్పట్లో మీడియా కనిపిస్తే అయ్యా బాబూ కొంచెం ప్రమోషన్ ఎక్కువ చేయండి ప్లీజ్. కొత్తమ్మాయిని కదా! అంటూ కాకా పట్టేది. కానీ ఇప్పుడలా లేదు. అనుకోకుండా ఆయాచితంగా రకుల్ కి బోలెడంత స్టార్ డమ్ వచ్చేసింది. ఇండస్ట్రీ బెస్ట్ హీరోల సరసన నటించేసింది. తెలుగు- తమిళం- హిందీ మూడు చోట్లా మూడు ముక్కలాట ఆడేస్తోంది.
ఐదారేళ్లలోనే అంత పెద్ద స్టార్ డమ్ అందుకున్న వేరొక నాయిక ఎవరూ లేరు. అదే మాటను రకుల్ కూడా అంది. అంతేకాదు.. అసలు మీరు ఏడాది కాలంగా తెలుగులో ఎందుకింత గ్యాప్ తీస్కున్నారు? అని ఎవరైనా అమాయకంగా ప్రశ్నిస్తే చాలు అడ్డంగా దొరికిపోయినట్టే. ఏడాది పాటు తెరకెక్కే హిందీ సినిమాకి ఏడెనిమిది నెలలలకు సరిపడా కాల్షీట్లు లాక్ చేసినప్పుడు నేనేం చేయాలి. వేరొక సినిమా ఎలా చేయగలను. అది పూర్తయ్యాక అంగీకరించాలి కదా? అని క్లాస్ తీస్కుంది. ఇటీవలే కిలాడీ సరసన దేదే ప్యార్ దే చిత్రంలో నటించినందుకు అన్ని కాల్షీట్లు ఇచ్చేసిందిట. అందుకే తెలుగులో గత ఏడాది నటించలేకపోయానని .. ఇప్పటికిప్పుడు ఏడు సినిమాలు రిలీజ్ లకు వస్తున్నాయని క్లాస్ తీస్కుంది. 2019లో ఏకంగా ఆరేడు రిలీజ్ లు ఉన్నాయి. ఒకేసారి నాలుగైదు సినిమాల్లో నటిస్తుంటే వాటిలో హిందీతో పాటు ఇంకొన్ని ఇతర భాషల్లో ఉంటాయి. వీటన్నిటినీ మ్యానేజ్ చేయాలి కదా? అంటూ జర్నలిస్టులకే క్లాస్ తీస్కుంది. అయినా అమీర్ ఖాన్ రెండేళ్లకోసారి సినిమా చేస్తాడు. ఆ సినిమాని పదేళ్లు గుర్తుంచుకుంటారు. దంగల్ గురించి ఇంకా మాట్లాడుకుంటున్నాం కదా! అంటూ తన రేంజు అమీర్ ఖాన్ రేంజు అని చెప్పకనే చెప్పింది. అప్పట్లో మర్జవాన్ రెండు నెలల్లోనే పూర్తయింది. సినిమా రేంజును బట్టి కాల్షీట్లు లాక్ అవుతాయని రకుల్ తెలిపింది.
ఇంతకీ బయోపిక్ లలో నటించే ఛాన్సొస్తే నటిస్తారా? అన్న ప్రశ్నకు తప్పకుండా చేస్తానని అంది. పీవీ సింధు బయోపిక్.. సైనా నెహ్వాల్ బయోపిక్ లు ఆల్రెడీ లాక్ అయిపోయాయి. అలాంటి విశేషం ఉన్న బయోపిక్ లో నటించే ఛాన్స్ వస్తే చేస్తానని తెలిపింది. రకుల్ ప్రస్తుతం మన్మధుడు 2 చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తమిళంలో సూర్యతో ఎన్జీకే ఈనెల 31న రిలీజవుతోంది. శివకార్తికేయన్ సరసన ఓ సినిమా చేస్తోంది. అలాగే సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి మర్జవాన్ చిత్రంలోనూ నటిస్తోంది. వీటితో పాటు మరో మూడు సినిమాలు క్యూలో ఉన్నాయని రకుల్ చెప్పింది.