Begin typing your search above and press return to search.

క్లాస్ పీకిన రకుల్ ప్రీత్ సింగ్

By:  Tupaki Desk   |   18 April 2022 9:33 AM GMT
క్లాస్ పీకిన రకుల్ ప్రీత్ సింగ్
X
టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగి బాలీవుడ్ కి చెక్కేసింది రకుల్ ప్రీత్ సింగ్.. ఇక బాలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీగా ఉంది ఈ అమ్మడు. ఇటీవల వరుస ఫోటో షూట్స్ తో రచ్చ చేస్తోంది ఈ భామ. ప్రసుతం ఈ అమ్మడి చేతిలో దాదాపు అరడజనుకు పైగా బాలీవుడ్ సినిమాలు ఉన్నాయి. రకుల్ లేటెస్ట్ మూవీ రన్ వే 34. ఈ సినిమా ఏప్రిల్ 29న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో రకుల్ ఈ చిత్ర ప్రమోషన్స్ లో పాల్గొంటోంది. రన్ వే మూవీలో రకుల్ పైలట్ తాన్యా రోల్ చేస్తోంది. ఈ మూవీలో అజయ్ దేవ్ గణ్, అమితాబ్ వంటి స్టార్స్ ప్రధాన పాత్రలు చేస్తున్నారు.

గత కొన్ని రోజులుగా ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో ముచ్చటిస్తూనే సోషల్ మీడియాలో అందాలు ఆరబోస్తూ రచ్చ రచ్చ చేస్తోంది రకుల్. టాలీవుడ్ లో వరుసగా అగ్ర హీరోలు అందరితో నటించిన రకుల్.. ఆ తర్వాత బాలీవుడ్ వైపు వెళ్లిపోయింది.

ఇక అక్కడే బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీతో ప్రేమలో పడింది ఈ యాపిల్ బ్యూటీ. జాకీ భగ్నానీతో ప్రేమలో ఉన్నట్లు కొన్నాళ్ల క్రితమే అధికారికంగా పోషళ్ మీడియాలో వెల్లడించింది. ఇక అప్పటి నుండి మీడియా, అభిమానులు, నెటిజన్లు మీరు పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు అని అడుగుతూనే ఉన్నారు.

మొదట్లో ఈ ప్రశ్న అడిగిన ప్రతి సారి ఇప్పుడే చేసుకోము, చేసుకుంటే చెప్తాము అంటూ సమాధానాలిచ్చేది రకుల్. అయినా వరుసగా మీడియా మముందుకొచ్చిన ప్రతి సారీ ఈ ప్రశ్న కచ్చితంగా ఎదురవుతోంది. ఇటీవల బాలీవుడ్ లో ఓ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా పెళ్లి గురించి ప్రశ్నించగా ఈ సారి కొంచెం ఘాటుగానే స్పందించింది.

పెళ్లి ప్రశ్నకి సమాధానమిస్తూ.. ఇది చాలా సాధారణ విషయం. ప్రతి ఒక్కరి జీవితంలో జరిగేదే. అమ్మ, నాన్న, తమ్ముడు ఎలా ఉంటారో జీవిత భాగస్వామి కూడా ప్రతి మనిషికి ఉంటారు. దాని గురించి ప్రత్యేకంగా మాట్లాడటం అనవసరం.

దయ చేసి ఇలా ప్రతి సారి అడగొద్దు. మా బంధం గురించి ఏదైనా చెప్పాల్సి వస్తే నేనే స్వయంగా చెప్తాను. అంతే గాని ఇలా ప్రతి ఇంటర్వ్యూలోనూ తన గురించి చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అని రకుల్ కొంచెం స్ట్రాంగ్ గానే వార్నింగ్ ఇచ్చింది.