Begin typing your search above and press return to search.
లైఫ్ టైం మూవీ, అందుకే డబ్బింగ్ చెప్పా
By: Tupaki Desk | 28 Dec 2015 8:02 AM GMTజూనియర్ ఎన్టీఆర్ - సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న నాన్నకు ప్రేమతో చిత్రంలో.. తొలిసారిగా యంగ్ టైగర్ కు జత కట్టింది రకుల్ ప్రీత్ సింగ్. ఇప్పటివరకూ గ్లామర్ పాత్రలనే చేస్తున్నా.. ఈ మధ్య అంతగా టైం కలిసి రాని రకుల్.. నాన్నకు ప్రేమతో పై చాలానే హోప్స్ పెట్టుకుంది. రకుల్ ప్రీత్ కి స్టార్ స్టేటస్ రావాలంటే.. ఈ మూవీ బ్లాక్ బస్టర్ కావడం చాలా ముఖ్యం.
అయితే.. హిట్ కోసమే కాకుండా.. ఒక నటిగా తన కెరీర్ లో తనకు చాలా నేర్పించిన సినిమా నాన్నకు ప్రేమతో అంటోందీ హీరోయిన్. ఒక నటికి, ఒక హీరోయిన్ కి చాలా తేడా ఉంటుందని, ఆ విషయాన్ని సుకుమార్ స్పష్టంగా చెప్పి తనలోని నటిని బయటకు తెచ్చాడంటోంది. అలాగే ఎన్టీఆర్ సూపర్ డ్యాన్సర్, చాలా గొప్ప యాక్టర్, అంకిత భావం ఉన్న వ్యక్తి.. ఇవన్నీ ఆన్ స్క్రీన్ అయితే.. ఆఫ్ స్క్రీన్ లో చాలా గొప్ప ఫాదర్ అని పొగిడేసింది. ముఖ్యంగా డ్యాన్సుల విషయంలో ఒకసారి స్టెప్ చూసి, రిహార్సల్ కూడా చేయకుండా ఆ స్టెప్ వేసేయడం తనను ఆశ్చర్యపరిచేదని.. షూటింగ్ సంగతులు పంచుకుంది రకుల్.
నాన్నకు ప్రేమతో చిత్రానికి నాన్న నిర్మాత బీవీఎస్ ఎన్ ప్రసాద్ అని మనస్ఫూర్తిగా చెప్పిందీ సుందరి. దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన అమేజింగ్ అని పొగుడుతూ... తనను అందంగా చూపించిన సినిమాటోగ్రాఫర్ కి కృతజ్ఞతలు తెలిపింది. "ఇలాంటి సినిమా చేయడం, కేరక్టర్ చేయడం జీవితంలో ఒకేసారి వచ్చే అవకాశం. దీన్ని జీవితమంతా గుర్తుంచుకోవాలని అనుకున్నా. అందుకే మొదటిసారిగా నా కేరక్టర్ కి నేనే డబ్బింగ్ చెప్పాను" అంటూ.. తనెందుకు డబ్బింగ్ చెప్పిందో వివరించింది పంజాబీ సుందరి రకుల్ ప్రీత్ సింగ్.