Begin typing your search above and press return to search.
ఫోటో స్టొరీ: డ్రీమ్ గర్ల్ ఇన్ బ్లాక్
By: Tupaki Desk | 5 Aug 2019 11:11 AM GMTరకుల్ ప్రీత్ కు తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపే ఉంది. దాదాపు అందరూ టాప్ స్టార్ హీరోల సినిమాల్లో నటించడమే కాదు.. కొన్ని హిట్లు కూడా నమోదు చేయడంతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సంపాదించుకుంది. అయితే ఈమధ్య హిందీ.. తమిళ సినిమాలపై ఎక్కువ ఫోకస్ చేయడంతో తెలుగులో సినిమాలు తగ్గాయి. దీంతో కాస్త గ్యాప్ వచ్చింది కానీ మరోసారి నాగార్జున 'మన్మథుడు 2' తో తెలుగు ప్రేక్షకులను మురిపించబోతోంది.
ఇక సోషల్ మీడియా రకుల్ జోష్ మామూలుగా ఉండదు. రెగ్యులర్ గా ఏదో ఒక హాట్ ఫోటోషూట్ లో పాల్గొనడం.. ఆ ఫోటోలను ఇన్స్టా ఖాతా ద్వారా షేర్ చేయడం రకుల్ కు ఎంత సులువు అంటే.. మనం వాట్సాప్ మెసేజ్ చెక్ చేసుకున్నంత. తాజాగా మరోసారి రెండు ఫోటోలను తన ఇన్స్టా ఖాతా ద్వారా షేర్ చేసింది. ఈ ఫోటోలకు "మీ రూల్స్ మీరే నిర్ణయించుకోండి" అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఈ డ్రెస్ ను డిజైన్ చేసింది సెలబ్రిటీ డిజైనర్ నీరజ కోన కావడంతో ఆమె పేరును కూడా టాగ్ చేసింది. ఒక చేతికి స్లీవ్.. మరో చేతికి స్లీవ్ లెస్ ఉండే బ్లాక్ గౌన్ డిఫరెంట్ గా కనిపిస్తోంది. డ్రెస్ కు డీప్ వీ నెక్ ఉండడంతో అందాల ప్రదర్శన కూడా ఆటోమేటిక్ గా జరిగిపోయింది.
ఈ ఫోటోలకు నెటిజన్ల నుండి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ ఫోటోలకు రాశి ఖన్నా.. హ్యూమా ఖురేషీలాంటి బ్యూటీలు లైక్స్ కొట్టారు. ఇక సాధారణ నెటిజన్ల గురించి చెప్పేదేముంది? పొగడ్తలతో చంపేశారు.. "డ్రీమ్ గర్ల్ ఇన్ బ్లాక్".. "కిల్లర్ పోజ్".. "రకుల్ ఓన్లీ మేక్స్ రూల్స్" అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ పెట్టారు. రకుల్ సినిమాల విషయానికి వస్తే అక్కినేని నాగార్జున కొత్త సినిమా 'మన్మథుడు 2' లో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా ఆగష్టు 9 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా కాకుండా శివ కార్తికేయన్ హీరోగా నటిస్తున్న ఒక తమిళ చిత్రంలో నటిస్తోంది. హిందీలో 'మర్జావా' అనే చిత్రంలో కూడా రకుల్ హీరోయిన్ గా నటిస్తోంది.