Begin typing your search above and press return to search.

ఫోటో స్టొరీ: అందమైన ఇన్స్టా డ్రాక్యులా!

By:  Tupaki Desk   |   18 March 2019 6:01 AM GMT
ఫోటో స్టొరీ: అందమైన ఇన్స్టా డ్రాక్యులా!
X
రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ లో కాస్త స్లో అయినట్టు కనిపించింది కానీ మళ్ళీ కొత్త సినిమాలు సైన్ చేస్తూ జోరు పెంచుతోంది. ఈ జోరుతో పాటుగాసోషల్ మీడియాలో కూడా ఫుల్ జోష్ చూపిస్తోంది. సోషల్ మీడియాలో జోష్ అంటే ఏముంటుంది చెప్పండి.. హాట్ ఫోటో షూట్లు చేసి.. ఆ ఫోటోలను పోస్ట్ చేసి నెటిజనుల హృదయంలో హుద్ హుద్ తుఫాను తీసుకు రావడమే.

అదే పని మరోసారి చేసేసింది రకుల్. తన ఇన్స్టా ఖాతా ద్వారా రీసెంట్ గా ఫోటో పోస్ట్ చేసి "తెలుపు క్లాసిక్ గా ఉంటుంది.. అలాగే నేను కూడా. #హలో అవార్డ్స్" అంటూ క్యాప్షన్ ఇచ్చింది. మార్క్ బమ్ గార్నర్ బ్రాండ్ దుస్తులలో మెరిసిన ఈ భామ డ్రస్ కలర్ తెలుపు అని చెప్తోంది కానీ అదేమో క్రీమ్ కలర్ఉంది. అయినా మన పిచ్చి కానీ కలర్ ఏదైతేనేం .. హాటుగా ఉండడం ముఖ్యం. థై-స్లిట్.. స్లీవ్ లెస్ గౌన్ లో కనిపించిన రకుల్ ఓ సెన్సువల్ పోజు కూడా ఇచ్చింది. హెయిర్ స్టైల్.. కళ్ళకు కొంచెం డార్క్ కలర్ మేకప్ చూస్తుంటే అందమైన డ్రాక్యులాగా అనిపిస్తోంది. రీల్ డ్రాక్యులా రక్తం తాగుతుందేమో కానీ ఈ ఇన్స్టాగ్రామ్ డ్రాక్యులా మాత్రం నెటిజనుల మనసులను ఇంటర్నెట్ ఒవెన్ పైన పెట్టి గ్రిల్ చేసేస్తోంది.

రకుల్ ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే సూర్య 'NGK' తో పాటు శివ కార్తికేయన్ హీరోగా నటిస్తున్నమరో సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. హిందీలో 'దే దే ప్యార్ దే'.. 'మర్జావాన్' చిత్రాలలో నటిస్తోంది. తెలుగులో సాయి ధరమ్ తేజ్- మారుతి కాంబినేషన్ లో తెరకెక్కనున్న సినిమాలో హీరోయిన్ గా ఎంపికయిందని టాక్.