Begin typing your search above and press return to search.

బ్రూస్ లీ మీదే అమ్మడి ఆశలన్నీ

By:  Tupaki Desk   |   22 Sept 2015 9:11 AM IST
బ్రూస్ లీ మీదే అమ్మడి ఆశలన్నీ
X
స్టార్ లీగ్ లోకి ఎంట్రీ ఇచ్చేందుకు గట్టి పోటీ ఇస్తున్న కుర్ర హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. ఒకేసారి ముగ్గురు టాప్ స్టార్స్ నటించే ఛాన్స్ పట్టేసి లక్కీ హీరోయిన్ అనిపించుకున్నా.. స్టార్ స్టేటస్ దక్కాలంటే మాత్రం బ్లాక్ బస్టర్ ఖాతాలో పడాల్సిందే. ఇప్పుడు తనకు పేరుతోపాటు హోదాని కూడా కట్టబెట్టే మూవీ కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తోందీ పంజాబీ సుందరి.

లక్ తెచ్చిపెడుతుందని భావించిన రవితేజ్ కిక్2.. నిరాశనే మిగిల్చింది రుకుల్ కి. కాస్త హద్దులు దాటి పబ్లిక్ లో లిప్ లాక్ చేసినా.. హిట్ మాత్రం రాలేదు. దీంతో ఈ భామ నెక్ట్స్ రిలీజ్ కానున్న బ్రూస్ లీ ది ఫైటర్ పై విపరీతంగా ఆశలు పెంచేసుకుంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మూవీలో బాగానే గ్లామర్ ఒలకబోసింది. బోల్డ్ గా నటించడంలోనూ రకుల్ ఎక్స్ పర్ట్ నేనని.. లేటెస్ట్ గా రిలీజైన బ్రూస్ లీ పోస్టర్ లు చెబ్తున్నాయి.

బ్రూస్ లీ కాక.. ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో లోను - అల్లు అర్జున్న సరసన రకుల్ ప్రీత్ నటిస్తోంది. అయితే.. ఈ రెండు సినిమాలు ఈ ఏడాదిలో రిలీజయ్యే అవకాశాలు లేవు. అంటే ఈ ఏడాదికి రకుల్ ఖాతాలో పెద్ద హిట్ పడాలంటే.. అది రామ్ చరణ్ వల్లనే సాధ్యమవుతోంది. అందుకే బ్రూస్ లీ కోసం తాను ఎంత చేయాలో, ఏం చేయాలో అన్నిటికీ సై అంటోంది. బెస్టాఫ్ లక్ రకుల్..