Begin typing your search above and press return to search.

ర‌కుల్ గాఢంగా హ‌గ్ ఇచ్చింది

By:  Tupaki Desk   |   14 Nov 2016 7:09 AM GMT
ర‌కుల్  గాఢంగా హ‌గ్ ఇచ్చింది
X
కొత్త జ‌న‌రేష‌న్ క‌థానాయిక‌లంతా కూడా ఫ్యాష‌న్ మంత్రం జ‌పించేవాళ్లే. ఏ చిన్న ఫంక్ష‌న్‌ కి వెళ్లాల‌న్నా ముస్తాబు కావ‌డానికి ప‌క్క‌న ఓ స్టైలిస్ట్ ఉండాల్సిందే... వాళ్లు డిజైన్ చేసిన దుస్తుల్ని ధ‌రించాల్సిందే. న‌లుగురి కంటే భిన్నంగా క‌నిపించాలనే ఆ ప్ర‌య‌త్నం. దానికి తోడు ఇండ‌స్ట్రీలో ఫ్యాష‌న్ మెల‌కువ‌లు బాగా తెలిసిన క‌థానాయిక‌గా - ట్రెండ్‌ కి త‌గ్గ‌ట్టుగా న‌డుచుకొనే క‌థానాయిక‌గా.... ఓ ప్ర‌త్యేక‌మైన గుర్తింపు సొంతం చేసుకోవ‌డం కోసం వాళ్లంతా ఇలా చేస్తుంటారు.

ఇక సినిమాల విష‌యానికొచ్చేస‌రికి ఫ్యాష‌న్ పిచ్చి మ‌రింత పీక్స్‌ కి వెళుతుంటుంది. అత్యుత్త‌మ స్టైలిస్ట్‌ ల్ని - డిజైన‌ర్ల‌ని దిగుమ‌తి చేసుకొంటుంటారు. నిర్మాత‌ల జేబుల‌కి చిల్లులు ప‌డుతున్నా స‌రే రాజీ ప‌డ‌కుండా కాస్ట్యూమ్స్‌ని డిజైన్ చేయించుకొంటుంటారు. హీరోయిన్ అందంగా క‌నిపిస్తే మ‌న సినిమాకే మంచిది క‌దా అంటూ నిర్మాత‌లు కూడా చూసీ చూడ‌న‌ట్టు వెళ్లిపోతుంటారు. టాలీవుడ్‌ లో ఫ్యాష‌న్ మంత్రం జ‌పించే హీరోయిన్ల‌నో ర‌కుల్ ప్రీత్‌ సింగ్‌ ని మొద‌టి వ‌రుస‌లో చేర్చొచ్చు. ఈమె ప్ర‌తి సినిమాలోనూ కొత్త‌గా క‌నిపించేందుకు ప్ర‌య‌త్నిస్తుంటుంది. బాలీవుడ్‌ కి చెందిన స్టైలిస్ట్‌ ల్నీ - డిజైన‌ర్ల‌ని ర‌ప్పిస్తుంటుంది. ధృవ సినిమా కోసం కూడా ఆమె ప్ర‌ముఖ కాస్టూమ్ డిజైన‌ర్ గీతికా చ‌డ్డాని పిలిపించింది. సినిమా కోసం ఆమె డిజైన్ చేసిన దుస్తులు అదిరిపోయాయ‌ని, ఎప్పుడూ లేనంత అందంగా ఈ సినిమాలో క‌నిపించబోతున్నాన‌ని ఆనందం వ్య‌క్తం చేస్తోంది ర‌కుల్‌. ఆ ఆనందంలోనే గీతికా చ‌డ్డాకి గాఢంగా ఓ హ‌గ్గిచ్చింది. ఆ హగ్గిచ్చినప్ప‌టి ఫొటోని ట్విట్ట‌ర్‌ లో పోస్ట్ చేసింది. కుర్రాళ్లంతా ఇప్పుడు ఈ ఫొటోని చూసుకొంటూ గీతికానైనా కాక‌పోతిని... ర‌కుల్ హ‌గ్గు టేస్టు చూడ‌గా అంటూ పాట పాడుకొంటున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/