Begin typing your search above and press return to search.
మగవాసన అంటే తెలియదంటున్న స్టార్ హీరోయిన్
By: Tupaki Desk | 9 April 2020 6:10 AM GMTరకుల్ ప్రీత్ సింగ్.. టాలీవుడ్లో ఒకప్పుడు టాప్ హీరోయిన్గా వెలుగొంది.. అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్న హీరోయిన్. చిన్న సినిమాల హీరోయిన్గా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చి తక్కువ టైమ్ లోనే స్టార్ హీరోల సరసన నటించి లక్కీ బ్యూటీగా పేరు తెచ్చుకుంది. కానీ టాలీవుడ్ లో రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుత పరిస్థితి ఏంటో చెప్పనక్కర్లేదు. గత రెండు సంవత్సరాలుగా ఈ అమ్మడి కెరీర్ డౌన్ ఫాల్ లో ఉంది. నాగార్జునతో నటించిన 'మన్మథుడు 2' కూడా నిరాశను కలిగించింది. ఇదిలావుండగా కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలో రకుల్ కి కొంతమందితో అఫైర్స్ ఉన్నాయంటూ రూమర్లు వచ్చిన విషయం తెలిసిందే. అయితే రకుల్ వాటి గురించి ఎప్పుడూ పెద్దగా పట్టించుకో లేదు. అంతే కాకుండా రూమర్లు వచ్చిన వ్యక్తులతో సన్నిహితంగా మెలిగినట్లు గానీ.. వాళ్ళతో కలిసి తిరిగినట్లు గానీ ఎప్పుడూ కనిపించలేదు.
ఇప్పుడు ఈమె కెరీర్ ముందంత ఊపు మీద లేకపోవడంతో రకుల్ గురించి అలాంటి రూమర్లు కూడా తగ్గిపోయాయి. ఇదిలా ఉండగా ఈ మధ్య ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర విషయాలు తెలియజేసింది రకుల్. ఈ సందర్భంగా తాను ఇప్పటికీ సింగిల్ గా ఉన్నానని స్పష్టం చేసింది. తను సింగిల్ గా ఉండిపోవడానికి కారణం ఒక రకంగా తన సోదరుడు అమన్ సింగ్ కారణమని ఈ పంజాబీ బ్యూటీ చెప్పుకొచ్చిందట.
స్కూల్ డేస్ నుండే ఆమె తమ్ముడు తనను ఒక గూఢచారిలా ఫాలో అయ్యేవాడని రకుల్ చెప్పిందట. తను స్కూల్ లో ఎవరైనా అబ్బాయిలతో మాట్లాడినా వెంటనే వచ్చి ఇంట్లో చెప్పేసేవాడని.. ఏదైనా అవసరం కొద్దీ తను ఎవరితో మాట్లాడాలన్నా తమ్ముడు ఇంట్లో చెబుతాడేమో అని భయపడాల్సి వచ్చేదని రకుల్ వివరించిందట. తన మీద అలా ఉన్నవీ లేనివీ చెబుతాడని తను అబ్బాయిలకు పూర్తిగా దూరంగా ఉండేదాన్నంటూ.. అలా అబ్బాయిలకు దూరంగా ఉండటం అలవాటు అయిపోయిందని, అందుకే ఇప్పటికీ తను సింగిల్ గా మిగిలిపోయినట్టుగా రకుల్ ప్రీత్ చెప్పిందంట.