Begin typing your search above and press return to search.

ర‌కుల్‌ పై ప‌డ్డ‌ హ్యాకర్స్‌!?

By:  Tupaki Desk   |   24 Oct 2018 4:59 PM GMT
ర‌కుల్‌ పై ప‌డ్డ‌ హ్యాకర్స్‌!?
X
బెల్లం ఉన్న‌చోటికే చీమ‌లు చేరతాయి. రంగుల ప్ర‌పంచంలో ఉర్రూత‌లూగించే క‌ల‌రింగ్‌ పైనే హ్యాక‌ర్లు క‌న్నేస్తారు. ప్ర‌స్తుతం సామాజిక మాధ్య‌మాల ట్రెండ్‌లో హ్యాక‌ర్ల‌కు ఇదో ఆట‌లా మారింది. ముఖ్యంగా సినీసెల‌బ్రిటీల ట్విట్ట‌ర్‌ లు - ఇన్‌ స్టాగ్ర‌మ్‌ ల‌ను హ్యాక్ చేయ‌డంలో ఆరితేరిన హ్యాకింగ్ ముఠాలు చెల‌రేగుతున్నాయి. వీళ్ల ల‌క్ష్యం ఏదైనా .. అత్యంత కీల‌క‌మైన సామాజిక మాధ్య‌మాల్ని బ్లాక్ చేయ‌డంతో నానా చిక్కులే వ‌చ్చి ప‌డుతున్నాయి.

తార‌లు ప్ర‌తి నిమిషం అభిమానుల‌తో ట‌చ్‌ లో ఉండేది ఇక్క‌డే. అందువ‌ల్ల హ్యాక్ అయితే తిప్ప‌లు త‌ప్ప‌డం లేదు. ఇప్ప‌టికే ప‌లువురు ట్విట్ట‌ర్‌ - ఇన్‌ స్టా అకౌంట్లు హ్యాక‌వ్వ‌డంతో ఫిర్యాదు చేసి - తిరిగి రికవ‌రీ చేయించుకున్నారు. రిక‌వ‌రీ అయ్యేలోపు చాలా గ్యాప్ ఇబ్బందిక‌రం. అప్ప‌ట్లో ప‌వ‌ర్‌ స్టార్ ప‌వ‌న్‌ క‌ల్యాణ్ ట్విట్ట‌ర్ అకౌంట్‌ ని హ్యాక్ చేశారు. ఆ త‌ర్వాత దానిని రిక‌వ‌రీ చేయ‌డం కోసం టైమ్ ప‌ట్టింది. ఒక వారం క్రితం త్రిష ట్విట్ట‌ర్‌ ని ఎవ‌రో హ్యాక్ చేశారని ఫిర్యాదు చేసింది. ఆ త‌ర్వాత రిక‌వ‌రీ ప్రాసెస్ చేశారు.

తాజాగా ర‌కుల్ ప్రీత్ హ్యాక‌ర్ల‌కు చిక్కింది. త‌న ఇన్‌ స్టాగ్ర‌మ్‌ అకౌంట్‌ ని ఎవ‌రో హ్యాక్ చేశార‌ట‌. రిక‌వ‌రీ అయ్యేవర‌కూ ఎవ‌రూ రెస్పాండ్ కావొద్దంటూ ట్విట్ట‌ర్‌ లో స‌మాచారం అందించింది. సెల‌బ్రిటీలు ఇలా చిక్కితే చాలు హ్యాక‌ర్లు అలా హ్యాక్ చేసి బుక్ చేసేస్తున్నారు. ర‌కుల్ ప్ర‌స్తుతం త‌మిళ ప‌రిశ్ర‌మ‌లో బిజీగా ఉంది. అక్క‌డ సూర్య - ఎన్జీకే చిత్రంతో పాటు, కార్తీతో ఓ సినిమా - శివ‌కార్తికేయ‌న్ స‌ర‌స‌న వేరొక సినిమా చేస్తోంది. బాలీవుడ్‌ లో అజ‌య్‌ దేవ‌గ‌న్ స‌ర‌స‌న `దేదే ప్యార్ దే` అనే చిత్రంలో న‌టిస్తోంది. తెలుగులో `ఎన్టీఆర్‌` బ‌యోపిక్‌ లో శ్రీ‌దేవి పాత్ర‌లో న‌టిస్తోంది. ఎందుక‌నో ఇటీవ‌ల స్టార్ హీరోల స‌ర‌సన ఈ అమ్మ‌డికి ల‌క్ చిక్క‌డం లేదు.