Begin typing your search above and press return to search.

నాలోంచి దాన్ని బయటకు తీశాడు

By:  Tupaki Desk   |   11 Jan 2016 5:30 PM GMT
నాలోంచి దాన్ని బయటకు తీశాడు
X
రకుల్ ప్రీత్ సింగ్ కి ఇన్నాళ్లూ చేసిన సినిమాలు ఒకెత్తు అయితే.. ఇప్పుడు రిలీజ్ కానున్న నాన్నకు ప్రేమతో మరొక ఎత్తు అనాలి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ - డైరెక్టర్ సుకుమార్ తో చేసిన ఈ మూవీ కోసం.. రకుల్ చాలా కష్టపడింది. అది కూడా ఎంతో ఇష్టంగా ఆ కష్టాన్ని కావాలని అనుకుని మరీ చేసింది. ఇప్పటి వరకూ తాను కేవలం హీరోయిన్ ని మాత్రమే అని.. కానీ తనలోంచి ఒక నటిని సుకుమార్ బైటకు తీశాడని రకుల్ ప్రీత్ చెబుతోందంటే.. ఈ సినిమా ఆమెపై ఎంతగా ప్రభావం చూపిందో అర్ధమవుతుంది.

- దర్శకుడి గురించి రెండు మాటలు?
సుకుమార్ తో పనిచేయడం ఎవరికైనా అదృష్టమే. తన నటీనటులను ఆయన సంపూర్తిగా నమ్ముతారు. డైలాగులు - సీన్ లపై యాక్టర్స్ ను ప్రయోగాలు చేయమంటారు కూడా.

- షూటింగ్ గురించి?
వర్కింగ్ స్టైల్ లో సుకుమార్ కి చాలా ప్రత్యేకత ఉంది. ఈ తరహా డైలాగ్స్ - సీన్స్ అంటూ ఓ సెట్ పట్టుకుని కూర్చోవడానికి ఆయన వ్యతిరేకం. చాలా వరకూ సెట్స్ లోనే ఇంప్రూవ్ చేసి తీస్తూ ఉంటారు. ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ చేసేప్పుడు ఎలా ప్రవర్తించానో గుర్తు చేసి, అలా నటించమంటారంటే.. సుకుమార్ స్టైల్ అర్ధమవుతుంది.

- మీ పాత్ర గురించి చెబుతారా ?
ఇందులో నేను ఓ మల్టీ బిలియనీర్ కూతురిగా యాక్ట్ చేస్తున్నా. అలాగే ఎన్టీఆర్ తో కూడా మొదటిసారిగా నటిస్తున్నాను. సినిమాకి సంబంధించిన ఏ యాంగిల్ లో అయినా.. ఎన్టీఆర్ చాలా బ్రిలియంట్.

- ఎన్టీఆర్ తో డ్యాన్సులు వేయడం గురించి?
డ్యాన్సుల్లో ఎన్టీఆర్ తో పోటీ పడ్డం కుదరని పని. కనీసం రిహార్సల్స్ కడా వేయకుండా... ఒకసారి అలా చూసి స్టెప్ వేసేస్తాడు. ఇతర హీరోలతో కూడా నేను డ్యాన్సులు చేసినా, ఎన్టీఆర్ కి పోటీ లేదంతే.

- రాబోయే ప్రాజెక్టుల గురించి
అల్లు అర్జున్ తో చేస్తున్న మూవీ సెట్స్ పై ఉంది. త్వరలో నితిన్ తో కూడా కలిసి నటించబోతున్నా.