Begin typing your search above and press return to search.

అక్క‌డ ర‌కుల్ హ‌వా బాగానే ఉంది...

By:  Tupaki Desk   |   24 March 2018 10:24 AM GMT
అక్క‌డ ర‌కుల్ హ‌వా బాగానే ఉంది...
X
అతి త‌క్కువ స‌మ‌యంలో స్టార్ హీరోలంద‌రి స‌ర‌స‌న న‌టించింది ర‌కుల్ ప్రీత్ సింగ్‌. మ‌హేష్‌ - ఎన్‌ టీఆర్‌ - రామ్‌ చ‌ర‌ణ్‌ - అల్లుఅర్జున్‌ - ర‌వితేజ‌ - నాగ‌చైత‌న్య... ఇలా దాదాపు ఇండ‌స్ట్రీలో పెద్దా - చిన్నా హీరోలంద‌రినీ ఒక రౌండ్ వేసిన ర‌కుల్ ప్రీత్‌ కు ఇప్పుడు తెలుగులో అవ‌కాశాలే క‌రువ‌య్యాయి. మ‌హేష్‌ బాబుతో క‌లిసి చేసిన ‘స్పైడ‌ర్‌’ తీవ్రంగా నిరాశ ప‌ర్చ‌డంతో ఆ ప్ర‌భావం ర‌కుల్ ప్రీత్‌ పై బాగా ప‌డింది.

టాలీవుడ్ పొమ్మ‌న‌వారినీ కోలీవుడ్ ర‌మ్మ‌నడం ఆన‌వాయితీ. ర‌కుల్ విష‌యంలో ఇదే జ‌రిగింది. కార్తీ హీరోగా న‌టించిన ‘తీర‌న్ అదీగారం ఒండ్రు’ సినిమాతో అక్క‌డి వారిని చాలా గ్యాప్ త‌ర్వాత మ‌ళ్లీ ప‌ల‌క‌రించింది ర‌కుల్‌. అది అక్క‌డ సూప‌ర్ హిట్ కావ‌డం - అందులో ర‌కుల్ అందానికీ - అభిన‌యానికీ ఆస్కారం ఉన్న‌పాత్ర చేయ‌డంతో త‌మిళ తంబీల‌కు న‌చ్చేసిందీ పిల్ల‌. ఆ త‌ర్వాత ఈ సినిమా తెలుగులో ‘ఖాకీ’ పేరుతో విడుద‌లై మంచి వ‌సూళ్లు రాబ‌ట్టింది. ఆ త‌ర్వాత కార్తీ అన్న సూర్య‌తో సెల్వ‌రాఘ‌వ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో చేస్తున్న ‘ఎన్‌ జీకే’ చిత్రంలో ర‌కుల్ ప్రీత్‌ - సాయిప‌ల్ల‌వితో క‌లిసి న‌టిస్తోంది. ర‌జ‌త్ ర‌విశంక‌ర్ అనే కొత్త ద‌ర్శ‌కుడితో కార్తీ చేస్తున్న సినిమాలోనూ ర‌కులే హీరోయిన్‌. ఇప్పుడు యువ‌న‌టుడు శివ‌కార్తీకేయ‌న్ హీరోగా రూపొందుతున్న సినిమాలోనూ ర‌కుల్‌నే హీరోయిన్‌ గా క‌న్ఫార్మ్ చేసింది చిత్ర బృందం. ‘ఇంద్రు నేత్రు నాలాయ్‌’ వంటి సైటిఫిక్ థ్రిల్ల‌ర్‌ ను తెర‌కెక్కించిన ఆర్‌. ర‌వికుమార్ ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నాడు.

కోలీవుడ్‌ తో పాటు బాలీవుడ్‌ లోనూ మంచి అవ‌కాశాలు అందుకుంటోంది ర‌కుల్‌. భారీ ఆశ‌లు పెట్టుకున్న ‘అయ్యారీ’ ఆడ‌క‌పోయినా, అజ‌య్ దేవ‌గ‌ణ్ కొత్త సినిమాలో హీరోయిన్‌గా న‌టిస్తోంది. తెలుగులో మాత్రం ఈ పిల్ల‌ను ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌ట్లేదు... పాపం!