Begin typing your search above and press return to search.

లిప్‌ లాక్‌ కావాలని పెట్టుకుంటామా?

By:  Tupaki Desk   |   28 Aug 2015 5:25 AM GMT
లిప్‌ లాక్‌ కావాలని పెట్టుకుంటామా?
X
కిక్‌2 జయాపజయాలతో సంబంధం లేకుండా నా పాత్రకు మాత్రం చక్కని గుర్తింపు దక్కిందని చెబుతోంది రకూల్‌ ప్రీత్‌ సింగ్‌. చైత్రగా నా మనసుకు నచ్చే పాత్రలో నటించాను. పల్లెటూరి అమ్మాయిగా నటిస్తూనే ఆధునిక భావాలున్న మగువగా కనిపించానని చెప్పింది. మాస్‌ మహారాజ్‌ రవితేజతో కలిసి నటించడం ఆనందంగా ఉంది. సెట్స్‌ లో నన్ను కూడా లేడీ రవితేజ అంటూ పిలిచేవారు. ఆ పిలుపు నాకు బాగా నచ్చేసింది. రవితేజ అంత యాక్టివ్‌ గా ఉంటానట. అందుకే అలా పిలిచేశారు.

కిక్‌2లో లిప్‌ లాక్‌ సన్నివేశం గురించి అందరూ అడుగుతున్నారు. అయినా లిప్‌ లాక్‌ ని ప్రత్యేకంగా ఎందుకు చూస్తారు? ప్రత్యేకత ఎందుకు ఆపాదిస్తారు? దానిని ఓ సన్నివేశంలో చూడొచ్చుగా? అయినా కావాలని పెట్టుకునే ముద్దులకు నేను వ్యతిరేకం.. అంటూ గారాలు పోయింది రకూల్‌. పెదవి ముద్దు దర్శకుడు చెప్పేంత వరకూ నాకు తెలియనే తెలీదు. కానీ ఆ సన్నివేశంలో అది అవసరమే అనిపించి చేసేశాను.. అంటూ చెప్పుకొచ్చిందీ హాట్‌ హీరోయిన్‌.