Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరిః గ్లామర్ గేట్లు తెరిచిన రకుల్

By:  Tupaki Desk   |   7 Feb 2018 8:40 AM GMT
ఫోటో స్టోరిః గ్లామర్ గేట్లు తెరిచిన రకుల్
X
మొన్నటివరకు తెలుగులో కేవలం గ్లామర్ పాత్రలే ఇస్తున్నారంటూ మండిపడింది రకుల్ ప్రీత్ సింగ్. కాని ఒక్కసారి బాలీవుడ్లో రెండో అవకాశం వచ్చిన తరువాత మాత్రం.. అస్సలు టైమ్ వేస్ట్ చేయట్లేదు. ఎలాగైతే అక్కడి హీరోయిన్లు తొలితొలి అడుగులు వేస్తున్నప్పుడు మ్యాగజైన్ల కోసం రచ్చ చేయడం మెదలెడతారో..ఇప్పుడు రకుల్ కూడా అదే బాటలో వెళ్ళాలని డిసైడ్ అయిపోయింది.

మనం చెప్పేదేముంది.. అక్కడ మ్యాగ్జిమ్ మ్యాగజైన్ తాజా సంచిక కవర్ పేజీని చూస్తున్నారుగా.. అమ్మడు అక్కడ పిచ్చెక్కించడం స్టార్ట్ చేసింది. తెల్లటి బికినీ వేసుకుని.. తన మేని సొగసులను బాగా సానబెట్టి మరీ దారబోస్తోంది. వయ్యారమైన తన కాళ్లతో ఎన్నో భావాలను పలికిస్తూ.. ఊపిరిని ఆడనివ్వకుండా చేస్తున్న ఆ క్లీవేజ్ తాలూకు సౌందర్యంతో అమ్మడు ప్రకంపనాలు సృష్టిస్తోంది. గ్లామర్ గేట్లు పూర్తి తెరిచేస్తూ.. మరి నేను రెడీగా ఉన్నాను మీరు కాచుకోండి అన్నట్లు అటు ఫిలిం మేకర్లకూ ఇటు ఆడియన్స్ కూడా ఛాలెంజులు విసురుతోంది ఈ సొగసరి.

ప్రస్తుతం హిందీలో అయ్యారి రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్న రకుల్.. తెలుగులో మాత్రం గ్లామర్ రోల్స్ చేయనంటూ మారం చేయడంతో ఒక్క ఛాన్సు కూడా రావట్లేదు. అయితే బాలీవుడ్ లో ఛాన్సు వస్తుంది అనగానే ఎలాగైతే త్రిష.. శ్రీయ.. కాజల్ మొదలగు భామలు అక్కడి మ్యాగజైన్ల కోసం గ్లామర్ రచ్చ చేసి అందాల విందుకు మేం సిద్దం అని సిగ్నల్ ఇచ్చారో.. రకుల్ కూడా అదే సిగ్నల్స్ ను జారీ చేసింది. చూద్దాం ఎంతమంది వీటిని పట్టించుకుంటారో!!