Begin typing your search above and press return to search.
#DRUGS కేసు: మీడియా తప్పుడు కథనాలు అంటూ కోర్టుకి రకుల్
By: Tupaki Desk | 27 Sep 2020 5:30 AM GMTసుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణానంతరం మాదకద్రవ్యాల దర్యాప్తు కేసులో తనపై మీడియా వ్యతిరేక కథనాలను ప్రచురించడాన్ని సవాల్ చేస్తూ అత్యవసర మధ్యంతర ఆదేశాలు కోరుతూ కథానాయిక రకుల్ ప్రీత్ సింగ్ దిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.
దీనిపై మరో వారంలో విచారణ జరగనుందని సమాచారం. రకుల్ ప్రీత్ ఆ కథనాలు వచ్చే సమయానికి షూటింగ్ కోసం హైదరాబాద్ లో ఉన్నారు. అయితే అప్పటికే తన పేరును ప్రస్థావిస్తూ మీడియా కథనాలను చూసి షాక్ అయ్యానని.. ముంబైలోని ఎన్.సి.బి పిలిచిందని కథనాలు ప్రచురించారని రకుల్ ఆరోపిస్తోంది. రియా చక్రవర్తి డ్రగ్స్ కేసులో కొనసాగుతున్న దర్యాప్తుకు సంబంధించి ముంబైలో ఎన్.సి.బి విచారణకు హాజరయిన సంగతిపై జాతీయ మీడియా కథనాలు వెలువరించింది.
ఇక హైదరాబాద్ లేదా ముంబై చిరునామాలలో ఎన్.సి.బి నుండి తనకు ఎలాంటి సమన్లు రాలేదు. తదనుగుణంగా రకుల్ హైదరాబాద్ లోనే ఉండిపోయారు. పిటిషనర్ అయిన రకుల్ తండ్రి కల్నల్ కుల్విందర్ సింగ్ 24 సెప్టెంబర్ ఉదయం విమానంలో ప్రయాణించాలని నిర్ణయించుకున్నారు. తాజా మీడియా కథనాల్లో నిజాల్ని తెలుసుకోవడానికి హైదరాబాద్ నుంచి ముంబైకి బయల్దేరారు`` అని పిటిషన్ లో పేర్కొన్నారు. అయితే 23 సెప్టెంబర్ సాయంత్రం నుండే మీడియా తప్పుడు కథనాల్ని ప్రారంభించిందని.. హైదరాబాద్ లో ఉన్న పిటిషనర్ ఎన్.సిబి దర్యాప్తు కోసం 23వ తేదీ సాయంత్రం ముంబైకి చేరుకున్నారని కథనాలొచ్చాయని వాదనలో పేర్కొన్నారు.
తనపై టీవీ ఛానెల్స్... ప్రింట్ లేదా సోషల్ మీడియాలో తప్పుడు కథనాలు ప్రసారం చేయవద్దని లేదా ప్రచురించవద్దని మీడియాను కోరడానికి రకుల్ హైకోర్టును ఆశ్రయించారు. మాదకద్రవ్యాల కేసులో తననుఅపఖ్యాతి పాలు చేసే లేదా అపవాదు చేసే కథనాలపై పరువు నష్టం కలిగించే ప్రయత్నాన్ని ఆపాలని నివేదించారు రకుల్. తాజా విచారణలో మీడియా నిగ్రహంపై ఆసక్తికర చర్చ మొదలైంది.