Begin typing your search above and press return to search.
రకుల్ ఉతికి ఆరేసిందిగా
By: Tupaki Desk | 4 March 2018 11:28 AM GMTబాలీవుడ్ ఎంట్రీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుని రకుల్ ప్రీత్ సింగ్ దేశం మొత్తం తిరిగి ప్రమోషన్ చేసినా లాభం లేకపోయింది. అయారి ఆ చిత్ర దర్శకుడు నీరజ్ పాండే కెరీర్ లోనే అతి పెద్ద ఫ్లాప్ గా మిగులుతుందని పాపం ఆయనైనా ఊహించి ఉండడు. అందుకే అక్కడ పెద్దగా ఆశలు పెట్టుకోకుండా సైలెంట్ గా తమిళ్ లో జెండా పాతే పనిలో ఉంది రకుల్. లాస్ట్ ఇయర్ అక్కడ చేసిన ఒరు అధికారి ఒండ్రు(తెలుగు ఖాకీ)ఘన విజయం సాధించడంతో కోలీవుడ్ నుంచి ఆఫర్స్ బాగానే వస్తున్నాయి. మరోసారి కార్తి పక్కన మరోవైపు అతని అన్నయ్య సూర్య పక్కన జోడి ఆఫర్ కొట్టేసిన రకుల్ ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో ఈ మధ్యకాలంలో కాస్టింగ్ కవుచ్ గురించి వస్తున్న వార్తల గురించి తనదైన శైలిలో స్పందించింది. అదేంటో తన మాటల్లోనే చూద్దాం.
ఇక్కడ 20 - 30 కోట్లు పెట్టి సినిమాలు తీసే నిర్మాతలు నువ్వు అందంగా ఉన్నావనో లేక తొందరగా కలిసిపోతున్నావనో అవకాశాలు ఇవ్వరు. దేనికైనా టాలెంట్ ముఖ్యం. అంతే తప్ప చనువుగా ఉన్నంతమాత్రాన ఛాన్సులు ఇచ్చేంత సీన్ ఇక్కడ లేదు. మన వైపు ఏదైనా ఆసక్తికరంగా ఉపయోగపడని విషయం దొరికితే చాలు దాని గురించే పదే పదే చర్చలు జరుగుతూ ఉంటాయి. ఇవి కాకుండా మనల్ని పీడిస్తున్న సమస్యలు మన చుట్టూ చాలా ఉన్నాయి. వాటిని ఎవరూ అడగరు. మసాలా ఉంటే చాలు దాన్ని ఎంతవరకైనా ప్రచారం చేసేందుకు మాత్రం సిద్ధంగా ఉంటారు. అవకాశవాదాన్ని చూపించుకోవడమే మనిషి స్వభావం కాబట్టి ఇలా ఎందుకు జరుగుతుంది అని నిందించలేం.
నాకు తెలిసి నాకున్న పాతిక దాకా సినిమాల అనుభవంలో ఇలాంటివి నేను చూడలేదు. నేను టాలెంట్ ని నమ్ముతాను. మీరు చెప్పినటువంటి వ్యక్తులు నాకు తారసపడలేదు. అతిగా ప్రవర్తించే వాళ్ళు నాకు తారసపడలేదు. అదృష్టం కొద్ది అందరు మంచివాళ్ళతోనే పని చేశాను కనక బహుశా ఇవన్ని తెలియవు అనుకుంటా. టాలెంట్ చూపిస్తే అవకాశాలు అవే వరిస్తాయి. అనవసర భ్రమలు పెట్టుకోవడం తప్పు.
ఇదండీ రకుల్ ప్రీత్ సింగ్ చెప్పిన సమాధానం. పడక పంచనిదే ఇక్కడ అవకాశం రాదు అని కొందరు ప్రచారం చేస్తున్న దరిమిలా రకుల్ చెప్పిన సమాధానాలు స్ట్రాంగ్ పంచ్ లాగా ఉన్నాయి. అయినా రకుల్ తనకు ఎదురు కాలేదు అంది కాని పూర్తిగా లేవు అని చెప్పలేదు కనక తాము ఇలాంటివి ఎదుర్కున్నాము అని చెప్పిన ఇతర హీరొయిన్ల మాటలు కూడా కొట్టిపారేయలేం.