Begin typing your search above and press return to search.
అందంగా లేవు ప్లాస్టిక్ సర్జరీ అవసరం అన్నారట
By: Tupaki Desk | 29 Dec 2019 7:28 AM GMTకాస్టింగ్ కౌచ్ విషయమై రకుల్ ప్రీత్ సింగ్ మరోసారి తన అభిప్రాయంను వ్యక్తం చేసింది. హీరోయిన్స్ తలొగ్గితేనే ఆఫర్లు వస్తాయనే వాదనను తాను ఎప్పటికి నమ్మను అంది. కాస్టింగ్ కౌచ్ అనేది ఒక అబద్దం అంటూ రకుల్ ప్రీత్ సింగ్ చెప్పుకొచ్చింది. అయితే కెరీర్ ఆరంభంలో బాడీ షేపింగ్స్ గురించి మాత్రం కామెంట్స్ కామన్ అంది. ఎవరికి తోచిన విధంగా వారు బాడీ షేపింగ్స్ గురించి కామెంట్స్ చేయడం చేస్తారని.. వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదంటూ రకుల్ చెప్పుకొచ్చింది.
కాస్టింగ్ కౌచ్ వ్యవహారంలో మనం ఎలా వ్యవహరించాం అనేది చాలా ముఖ్యమైన విషయం. మనం మెతకగా ఉంటే ఇబ్బందులు తప్పవు. కాస్త జాగ్రత్తగా ఉంటేనే నెగ్గుకు వస్తారంది. నా కెరీర్ లో నేనెప్పుడు సెక్సువల్ గా ఇబ్బంది పడింది లేదు. కాని నా బాడీ షేపింగ్ విషయంలో కొందరు నన్ను విమర్శించారు. నేను అందంగా లేనని.. నా బాడీ షేపింగ్స్ సరిగా లేవని ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవాలంటూ సూచించారు.
నేను ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవాలంటూ అన్న వారు ఆ తర్వాత నన్ను అభినందించారు. ఇండస్ట్రీలో రాణించాలంటే అందంతో పాటు అదృష్టం కూడా ఉండాలని ఈ అమ్మడు పేర్కొంది. సినిమా పారితోషికం విషయంలో స్పందిస్తూ ఒక సినిమా కోసం మనం కేటాయించిన కాల్షీట్లను బట్టి పారితోషికం ఉంటుందని అంది. ఉత్తరాది హీరోయిన్స్ కంటే సౌత్ హీరోయిన్స్ ను ఇక్కడి వారు ఎక్కువగా గౌరవంగా చూస్తారని పేర్కొంది. సౌత్ లో సినిమాలు చేయడమే తనకు ఇష్టమని పేర్కొంది.