Begin typing your search above and press return to search.

రకులూ హాటే.. ఆ రేటూ హాటే..

By:  Tupaki Desk   |   14 Oct 2017 5:15 PM GMT
రకులూ హాటే.. ఆ రేటూ హాటే..
X
సినిమా తారలు వచ్చిన మొదట్లో కేవలం వచ్చిన అవకాశాలను ఎలా సద్వినియోగం చేసుకోవాలనే విషయంపైనే ఎక్కువగా దృష్టి పెడతారు. హీరోయిన్లయితే మొదటి రెండు సినిమాల వరకు కొంచెం నార్మల్ గానే ఉంటారు. ఇక చేసిన రెండు సినిమాలు సక్సెస్ అయితే ఒక్కసారిగా వారి రేంజ్ మారిపోతుంది. గ్లామర్ డోస్ ని పెంచేసి అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా చూస్తారు. అంతే కాకుండా రెమ్యునరేషన్ ని కూడా పంచేస్తారు.

అది సరిపోదు అన్నట్టు మరో వైపు యాడ్స్ - షాప్ ఓపెనింగ్స్ అంటూ.. రెండు చేతులా సంపాదిస్తారు. సాధారణంగా ప్రతి ఇండస్ట్రీలో హీరోయిన్స్ అలాంటి కార్యక్రమాలకు కొంచెం మీడియం ఎమౌంట్ ని తీసుకుంటారు. ప్రస్తుతం తమన్నా - కాజల్ లాంటి వారు ప్రచార కర్తలుగా ఉండేందుకు రూ.60 లక్షల నుండి 1 కోటి రూపాయల వరకు డిమాండ్ చేస్తున్నారట. కానీ ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ లో ఒకరిగా ఉన్న రకుల్ ప్రీత్ మాత్రం బ్రాండ్ అంబాసిడర్ గా ఉండడానికి మొత్తంగా రూ.1.5 కోట్ల వరకు అందుకుంటుందట. ప్రస్తుతం రకుల్ హవా బాగానే సాగుతోంది. చూస్తుంటే రకుల్ మాత్రమే కాదు.. ఈ రేటు కూడా బాగా హాటేనండోయ్ అనుకోవాలి.

నాన్నకు ప్రేమతో - రారండోయ్ వేడుక చూద్దాం వంటి వరుస హిట్స్ అందుకొని ఏకంగా మహేష్ స్పైడర్ సినిమాలో నటించింది. సినిమా డిజాస్టర్ అయినా రకుల్ చేతిలో ఇప్పుడు ఆఫర్స్ బాగానే ఉన్నాయ్. కోలీవుడ్ లో కార్తీ తో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక బాలీవుడ్ లో కూడా ఒక సినిమాను చేస్తోంది. అంతే కాకుండా మహేష్ 25వ సినిమాలో కూడా ఛాన్స్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది.