Begin typing your search above and press return to search.

లివింగ్ రిలేషన్ షిప్ వద్దు పెళ్లే ముద్దు!

By:  Tupaki Desk   |   8 Aug 2019 4:19 AM GMT
లివింగ్ రిలేషన్ షిప్ వద్దు పెళ్లే ముద్దు!
X
ఒకప్పుడు లివింగ్ రిలేషన్ షిప్ అంటే వామ్మో అనుకునే వారు. ఇప్పుడు మాత్రం ఆ పదం చాలా సింపుల్ అయిపోయింది. ఈ సాంప్రదాయం ఎక్కువగా బాలీవుడ్ లో నడుస్తుంది. అయితే ఇప్పుడిప్పుడే అన్ని వుడ్ లకి వ్యాప్తి చెందుతుంది. టాలీవుడ్ లో కూడా లివింగ్ రిలేషన్ షిప్ అనేది మాములు అయిపోయింది.

ఇటీవలే లివింగ్ రిలేషన్ షిప్ పై స్పందించింది హెల్తీ బ్యూటీ రకుల్ ప్రీత్. ఓ ఇంటర్వ్యూలో లివింగ్ రిలేషన్ షిప్ పై మీ కామెంట్ ఏంటి...అని అడగ్గా తనకి లివింగ్ రిలేషన్ షిప్ అంటే అస్సలు పడదని - పెళ్లి మీద తనకి రెస్పెక్ట్ ఉందని దాన్ని గౌరవిస్తానని చెప్పుకొచ్చింది. బాలీవుడ్ లో సినిమాలు చేస్తున్న పరిణామంలో రకుల్ కి ఈ ప్రశ్న ఎదురైంది.

ప్రస్తుతం తెలుగులో నితిన్ తో సినిమా చేస్తున్న రకుల్ త్వరలోనే ఇండియన్ 2 లో సిద్దార్థ్ సరసన హీరోయిన్ గా నటించనుంది. ఈ రెండు సినిమాలతో పాటు ఓ హిందీ సినిమా చేయనుంది. లేటెస్ట్ గా బాలీవుడ్ సినిమాకి సైన్ చేసింది. ప్రస్తుతానికి రకుల్ చేతిలో ఈ మూడు సినిమాలే ఉన్నాయి. ఇవి పూర్తయ్యాకే మిగతా ప్రాజెక్ట్స్ లైన్ పెట్టనుంది.