Begin typing your search above and press return to search.

సమానంగా నటిస్తే అడగాలి తప్పులేదు

By:  Tupaki Desk   |   19 Dec 2017 7:22 AM GMT
సమానంగా నటిస్తే అడగాలి తప్పులేదు
X
ప్రస్తుతం ఏ సినిమా ఇండస్ట్రీలో అయినా ప్రతి హీరోయిన్ మదిలో మెదిలో ఒకే ఒక్క ప్రశ్న.. హీరోతో పాటుగా హీరోయిన్లు కూడా సమన స్థాయిలో వర్క్ చేస్తున్నప్పుడు ఈక్వల్ గా రెమ్యునరేషన్ ఎందుకు ఇవ్వరు? అని హాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు అందరు హీరోయిన్స్ ఈ విషయంపై కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ మధ్య టాలీవుడ్ కోలీవుడ్ భామలు కూడా వారి హోదా చాలా పెరిగిందని ఇప్పటికైనా ఆ వ్యత్యాసంలో మార్పులు రావాలని గట్టిగానే చెప్పారు.

ముఖ్యంగా కోలీవుడ్ లో కూడా కొంతమంది భామలు పురుషాధిక్యం చాలా ఎక్కువైపోయిందని చెబుతున్నారు. మొన్న అమలాపాల్ - జ్యోతిక వంటి తారలు ఇదే విషయాన్ని ప్రస్తావించి హాట్ టాపిక్ అయ్యేలా చేశారు. అయితే ఇప్పుడు తెలుగులో కూడా కొంతమంది తారలు ఆ విధంగా స్పందిందిస్తున్నారు. అయితే రకుల్ మాత్రం కొంచెం విభిన్నంగా మాట్లాడుతోంది. రెమ్యునరేషన్ అనే ఒక్క విషయంలోనే కాదు.

ప్రతి విషయంలో పురుషాధిక్యత కనిపిస్తోంది. అందుకు కారణం కూడా లేకపోలేదు. మన సినిమాలు ఎక్కువగా కథానాయకుల చుట్టే తిరుగుతాయి. ఒకవేళ కథానాయికలు ఆ బాధ్యతలు తీసుకున్నప్పుడు అందుకు తగ్గట్టుగా రెమ్యునరేషన్ అడగడంలో తప్పులేదు. మన పాత్రలకు సమానంగా రెమ్యునరేషన్ ని తీసుకోవాలి. అది ఇప్పట్లో సడన్ గా వచ్చే మార్పు కాదు. కొంచెం కొంచెంగా వస్తుందని అంటూ ఫ్యూచర్ లో హీరోయిన్స్ కి మంచి గుర్తింపు లభిస్తుందని రకుల్ తన అభిప్రాయాన్ని చెప్పింది.