Begin typing your search above and press return to search.

10 రోజుల షెడ్యూళ్లు చాలు నాయనో - ర‌కూల్‌

By:  Tupaki Desk   |   15 Oct 2015 5:45 PM GMT
10 రోజుల షెడ్యూళ్లు చాలు నాయనో - ర‌కూల్‌
X
అస‌లు సినిమా ప్ర‌పంచంలోకి రాక‌ముందు, సినిమాల్లోన‌టించ‌క‌ముందు, ఓ డెబ్యూ హీరోయిన్ మాన‌సిక ప‌రిస్థితి ఎలా ఉంటుందో ఊహించ‌గ‌ల‌మా? కానీ ఇది చ‌దివాక అర్థం చేసుకోగ‌లం. సినిమా రంగం అంటే అదేదో ప‌దిరోజుల వ్యాప‌కం అనో, లేక 9-6 జాబ్ అనో అనుకునే ఇమేచ్యూర్డ్ ప‌రిస్థితి కొంద‌రికి ఉంటుంది. 18 ప్రాయంలో మిస్ ఇండియా కిరీటం ద‌క్కించుకున్న ర‌కూల్‌ప్రీత్ ప‌రిస్థితి కూడా ఇదే.

అస‌లు సినిమా అంటే రోజుల త‌ర‌బడి క‌ట్టుబ‌డి ఆన్‌సెట్స్ ప‌నిచేయాల‌ని కానీ, లేక చాలాఎక్కువ హార్డ్‌వ‌ర్క్ చేయాల‌ని కానీ అంచ‌నా వేసి ఉండ‌దు. అందుకే నేను ఏదో ఓ ప‌దిరోజుల షెడ్యూల్ చేసుకునే సినిమాలు చాల్లే అనుకున్నాను. ఆ సంగ‌తినే మా నాన్న‌కు చెప్పాను.. కానీ కాల‌క్ర‌మంలో అస‌లు విష‌యం అర్థమైంది. అస‌లు నేను కాలేజ్‌ చ‌దువుకునేప్పుడే నాన్న‌గారు నేను మోడ‌ల్‌ని కావాల‌ని నా ఫోటోల్ని ఏజెన్సీల‌కు పంపించారు. అలా అవి ఓ డైరెక్ట‌ర్ ద‌గ్గ‌ర‌కు చేరాయి. క‌న్న‌డ సినిమాలో ఆఫ‌ర్‌వ‌చ్చింది. కానీ నా ఆప్ష‌న్ బాలీవుడ్‌. న‌టిస్తే అక్క‌డే న‌టించాల‌ని అనుకున్నా. అంతేకానీ క‌న్న‌డ సినిమా ఏంటి అనుకునేదాన్ని.. అంటూ త‌న‌లోని ఇమెచ్యూరిటీని బైట‌పెట్టింది.

అయితే అనుకున్న‌ట్టే బాలీవుడ్‌లో యారియాన్ సినిమాతో ఛాన్స్ వ‌చ్చాక కెరీర్ తిరిగి చూసుకునేప‌నిలేకుండా తెలుగులోనూ స్టార్ అయిపోయాను. ఇప్పుడు క్ష‌ణం తీరిక లేదు. మొద‌టి సినిమా అవ‌కాశం వ‌చ్చినప్పుడు .. రూ.2000 పాకెట్ మ‌నీ, ఒక కార్ ఇచ్చార‌ని ర‌కూల్ చెప్పింది. అవి ఇచ్చారు కాబ‌ట్టే నేను ఆరోజు తొలి సినిమాకి అంగీక‌రించాన‌ని గారాలు పోతూ చెప్పింది అమ్మ‌డు.అదీ సంగ‌తి.