Begin typing your search above and press return to search.

నన్ను ఫిట్‌నెస్‌ సైకో అని పిలొచ్చు

By:  Tupaki Desk   |   27 Jun 2015 3:30 PM GMT
నన్ను ఫిట్‌నెస్‌ సైకో అని పిలొచ్చు
X
ఫిట్‌నెస్‌ ఫిట్‌నెస్‌ ఫిట్‌నెస్‌.. ఇది లేనిదే కథానాయికకు జీవితమే లేదు. అనుష్క, తమన్నా, ఇలియానా, శ్రీయ .. ఇలా ఎవరైనా ఫిట్‌నెస్‌ మంత్రాన్ని జపించాల్సిందే. యోగా, ధ్యానం, జిమ్‌ తప్పనిసరి. నవతరం నాయికలు కూడా దీన్ని అనుసరిస్తున్నారు. అడ్డంగా తిని బరువెక్కిపోతే కెరీర్‌ ముగిసినట్టే కాబట్టి నిద్రలోనూ జిమ్మింగ్‌ గురించే కలవరిస్తున్నారు. అయితే నవతరం స్టార్‌ హీరోయిన్‌ రకూల్‌ ప్రీత్‌కి అలాంటి అవసరమే లేదు. ఈ భామ సినిమాల్లోకి రాక ముందు నుంచే ఫిట్‌నెస్‌ క్వీన్‌. అసలు తనలోకి ఆ జ్వరం ఎలా ప్రవేశించింది? అని అడిగితే ఇలా చెప్పుకొచ్చింది.



=నాన్న స్వతహా ఆర్మీ అధికారి. దానివల్ల చిన్నప్పుడే ఫిట్‌నెస్‌ అవసరాన్ని చెప్పారు. అందుకే ఎప్పట్నుంచో ఇంట్లోనే వ్యాయామం చేసే అలవాటుంది.

=రెగ్యులర్‌గా కసరత్తులు చేయడం వల్ల చెమటలోంచి వ్యర్థాలు బైటికి వెళ్లిపోతాయి. దానివల్ల శరీరం తేలికై బరువు తగ్గామనిపిస్తుంది. వ్యాయామం చేసిన తర్వాత కండరాల్లో కొంచెం నొప్పి పుడుతుంది. ఆ నొప్పి అంటే నాకు చాలా ఇష్టం. నన్ను ఓ రకంగా పిట్‌నెస్‌ సైకో అని పిలిస్తే తప్పేం లేదు.

=జీరోసైజ్‌ అనేది నా ఒంటికి సరిపడదు. 5 అడుగుల 8 అంగులాలు నా పొడవు. ఇంత పొడవున్న అమ్మాయి జీరోసైజ్‌లో కనిపిస్తే కడ్డీలా కనిపిస్తుంది. అందుకే ఆ ప్రయత్నం ఎప్పటికీ చేయను.

=రోజూ 6 గంటలు ఘాడంగా నిద్రిస్తా. అంతకుమించి పడుకుంటే బద్ధకం అనిపిస్తుంది. వేకువ ఝామునే నిద్ర లేచేస్తా.

=పచ్చి కూరగాయలు తినడం మంచిదే అనుకుంటారు. కానీ నా అనుభవం వేరు. అవి త్వరగా అరగవు. జీర్ణం అవ్వకపోతే గ్యాస్‌ పుడుతుంది. దానివల్ల బోలెడంత ఇబ్బంది. అసలే తిండీ లేని పరిస్థితి వచ్చేస్తుంది. అందుకే ఆ పొరపాటు ఎప్పటికీ చేయను. అలాగే అన్నం తినడం వల్ల కార్బొహైడ్రేట్స్‌ ఎక్కువైపోతాయని తినడం మానేస్తారు. కానీ అది తప్పు. సమపాళ్లలో తిండి తినాలి.

=నాతో పాటే ఆన్‌సెట్స్‌కి నా కుక్‌ని తీసుకెళ్తాను. అతడు వండినది మాత్రమే తింటాను. బైట ఆహారం తినాలంటే భయపడతా. ఆయిల్‌ ఫుడ్స్‌ అస్సలు తినను.