Begin typing your search above and press return to search.
రకుల్.. ఇదంటా నమ్మమంటావా నానా??
By: Tupaki Desk | 26 Jun 2017 5:03 AM GMTఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ గురించి రకరకాలు వార్తలు వస్తున్నాయి. ఆమె చెప్పింది కొంచెం అయితే దానికి మసాలా అద్ది మనోళ్ళు క్రియేట్ చేసే స్టోరీ ఇంకోటి. అదిగో అమ్మడు నిద్రలేని రాత్రులు గడిపాను అని చెబితే.. దానికి వెంటనే తిండిలేని సాయంత్రాలు అంటూ మనోళ్ళు ఇంకో ప్రాస యాడ్ చేశారు. ఇదంతా చూస్తుంటే నిజంగానే షాక్ తినేయాలి మనం.
నిజానికి ఆర్మీ ఫ్యామిలీ నుండి వచ్చిన రకుల్ ప్రీత్ కు.. బెంగుళూరులో పుట్టి పెరిగినప్పటి నుండి.. అసలు జీవితంలో సినిమా కష్టాలేవీ లేవు. అదేనండీ.. జీవితంలో డబ్బులు ఆస్తులు తిండి తిప్పలు వంటి విషయంలో ఆమె కంగారుపడాల్సిందే లేదు. డాడ్ ఆర్మీ కాబట్టి అన్నీ హ్యాపీగానే సాగిపోతాయ్. అయితే అమ్మడు కాలేజీలో చేరక మునుపే సినిమా ఛాన్సులు వచ్చాయి. ఆ తరువాత ఆమె మిస్సిండియా పోటీల్లో పాల్గొని.. కనీసం ఫైనలిస్ట్ పొజిషన్ కు కూడా వెళ్లలేక ఓడిపోయింది. కాని థ్యాంక్స్ టు తెలుగు సినిమా ఇండస్ర్టీ. ఆమెలో గ్లామర్ ఉంది కాబట్టి మనోళ్ళు వెంటనే మళ్లీ ఛాన్సులు ఇచ్చేశారు. కెరియర్ స్టార్టింగులో రెండు మూడు హిట్లు రావడంతో అమ్మడు బిజీ హీరోయిన్ అయిపోయింది.
ఇదంతా చూశాక.. అసలు రకుల్ నిద్రలేని రాత్రులు గడిపాను..ఒక్కోసారి తిండి కూడా లేదు.. అనే స్టేట్మెంట్ ఇచ్చిందంటే మనం నమ్మాలంటారా? సినిమా ఆడుతుందా లేదా? సినిమాలు వస్తాయా లేదా? అనే టెన్షన్ ఉండొచ్చు కాని.. మరి నిద్రలేని రాత్రులు తిండిలేని సాయంత్రాలు అంటే కథలు చెబుతున్నట్లే. ఆ కథను రకుల్ చెప్పినా.. మీడియా క్రియేట్ చేసినా.. అదంతా జస్ట్ సొల్లే!!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/