Begin typing your search above and press return to search.
టైమింగ్ కాదు.. టైమ్ ముఖ్యం
By: Tupaki Desk | 29 Oct 2015 1:30 PM GMTకిక్2 - బ్రూస్‌లీ సినిమాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. అందుకే రకూల్ ప్రీత్ సింగ్ కాస్త ఢీలాపడినట్టే కనిపిస్తోంది. అయితేనేం ఇంకా మునుముందు స్టార్ హీరోల సరసన అవకాశాలకు కొదవేం లేదు. ఇప్పటికిప్పుడు ఎన్టీఆర్ సరసన నాన్నకు ప్రేమతో చిత్రంలో నటిస్తోంది రకూల్. బన్ని సరసన ఓ సినిమాలో నాయికగా ఎంపికైంది. మహేష్ సరసన ఛాన్స్ ఊరిస్తూనే ఉంది. ఈ సన్నివేశంలో టైమింగ్ కి - టైమ్ కి ఉన్న తేడా ఏంటో రకూల్ విశ్లేషించింది.
ఎప్పుడు - ఎక్కడ - ఏది - ఎలా చేయాలో నన్ను చూసి తెలుసుకోండి. ఇప్పుడు టైమింగ్ కంటే టైమ్ చాలా ఇంపార్టెంట్ నాకు. కేవలం గ్లామరస్ పాత్రల్లోనే నటిస్తున్నారు. ప్రయోగాత్మక క్యారెక్టర్లు చేయరా? అని అడుగుతున్నారు. ఇది తెలివితక్కువ ప్రశ్న. ప్రయోగాలు చేస్తాను. కానీ దానికి ఓ టైమ్ రావాలి. ఇప్పటికి నేను చేస్తున్న గ్లామర్ డాళ్ రోల్స్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పింది. స్టార్ హీరోల సరసన అవకాశాలొస్తున్నాయ్. కోట్లలో పారితోషికం ముడుతోంది. ఇలాంటప్పుడు ప్రయోగాలు పేరుతో తనవైపు వచ్చే అవకాశాల్ని కాలరాసుకోలేదు కదా.. ఆ విషయాన్నే కాస్త తెలివిగా చెప్పింది అమ్మడు.
ట్రెండ్ ని ఫాలో అవుతా. ట్రెండ్ కి తగ్గట్టే కనిపిస్తానని తెలివిగా చెబుతోంది ఈ పంజాబీ పోరి. అయితే ఇప్పుడొస్తున్న నాన్నకు ప్రేమతో - సరైనోడు వంటి సినిమాలు తేడా పడితే మాత్రం.. టోటల్ గా అమ్మడికి సీన్ సితార్ అయిపోతుంది.