Begin typing your search above and press return to search.

ఏడుస్తూనే ఉన్న రకుల్!!

By:  Tupaki Desk   |   2 Aug 2017 12:41 PM GMT
ఏడుస్తూనే ఉన్న రకుల్!!
X
సమంత తరువాత తెలుగులో బిజీగా ఉంటూ పెద్ద పెద్ద స్టార్లతో నటిస్తున్న హీరోయిన్ ఎవరైనా ఉన్నారంటే ఖచ్చితంగా రకుల్ ప్రీత్ సింగ్ పేరును చెప్పాల్సిందే. అమ్మడు ఇప్పుడు స్పైడర్ సినిమాలో మహేష్‌ బాబుతో నటిస్తూ.. ఇక పవన్ కళ్యాణ్‌ తో నటిస్తే టాలీవుడ్ దిగ్గజ స్టార్లందరితోనూ నటించేసినట్లే అనిపించుకుందాం అని చూస్తోంది.

అసలు బోయపాటి శ్రీనుతో 'సరైనోడు' సినిమాను చేస్తున్నప్పుడే ఈ సినిమాకు కూడా సైన్ చేశాను అంటోంది రకుల్. ''బోయపాటి శ్రీను సార్ కన్విక్షన్ నాకు బాగా ఇష్టం. ఆయన ఒక్క నిమిషంలో లొకేషన్లో మూడ్ మొత్తం మార్చేసి తనకు కావల్సినట్లు చేయించుకుంటారు. అందుకే ఈ సినిమా ఒప్పేసుకున్నా'' అని చెప్పింది. తను చేసిన క్యారక్టర్ గురించి చెబుతూ.. ''ఈ సినిమాలో ఎక్కువ శాతం నాది ఎమోషనల్ రోల్. అందుకే చాలా సీన్లలో ఏడుస్తూనే ఉంటాను. కళ్ళలో నీళ్లు కనిపించడానికి గ్లిజరిన్ వాడేశాను. రోజూ షూటింగ్ అయిపోయేసరికి.. నీ షూట్ అయిపోయింది ఇంక ఆపెయ్ అంటూ బోయపాటి ఏడిపించేవారు'' అనేసింది రకుల్. గతంలో సరైనోడు సినిమాలో కూడా చాలాసేపు ఇలా ఏడుస్తూనే ఉంది రకుల్. మరి సెంటిమెంటల్ గా బోయపాటి అలా పెట్టేశాడో ఏంటో.

ఇకపోతే ఈ సినిమాలో నటించిన బెల్లంకొండ శ్రీనివాస్ కూడా చాలా మెచ్చూర్డ్ గా నటించాడంటూ కితాబిస్తోంది రకుల్. ఈ సినిమాతో తాను మళ్ళీ మరో హిట్ కొడతానని.. రారండోయ్ వేడుక చూద్దాం సినిమా తరువాత ఈ సినిమాలో చేసిన పాత్ర చాలా అద్భుతంగా ఉందంటూ హొయలు పోతోంది అమ్మడు. చూద్దాం వచ్చే ఆగస్టు 11న సినిమా రిలీజయ్యాక ఈమె ఫేట్ ఎలా ఉండబోతుందో!!