Begin typing your search above and press return to search.

కామెడీనే కాదు మెసేజ్ కూడా ఉంది -రకుల్

By:  Tupaki Desk   |   20 Aug 2015 6:27 PM GMT
కామెడీనే కాదు మెసేజ్ కూడా ఉంది -రకుల్
X
కిక్ 2.. అల్టిమేట్ కామెడీ ప్లస్ యాక్షన్ అని మనకు ఇప్పటికే తెలుసు. ఇంతే కాదంట. ఈ మూవీలో జనాలకు పనికొచ్చే మెసేజ్ కూడా ఉందని చెబుతోంది హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. మూవీ ప్రమోషన్ లలో తన ఆన్ స్క్రీన్ హీరో రవితేజని సూపర్ అంటూ తెగ ప్రశంసలు కురిపిస్తోంది కూడా. ఆయన డెడికేషన్, పంక్చువాలిటీ, ప్రొఫెషనలిజం అన్నీ నచ్చేశాయట. అంత సీనియర్ హీరో అయిన రవితేజ ఇంత సాఫ్ట్ గా ఉంటాడని ఎప్పుడూ అనుకోలేదట కూడా.

కిక్ 2లో తన కేరక్టర్ రకుల్ కి బాగా నచ్చిందని చెబుతోంది. డ్యుయల్ రోల్ కాకుండా.. రెండు షేడ్స్ ఉన్న కేరక్టర్ చేశానంటోంది. అయితే హీరోయిన్ గా తన హద్దులేంటో బాగా తెలుసంట అమ్మడికి. ఫిలిం ఇండస్ట్రీలో గ్లామర్ కే ఇంపార్టెన్స్ ఉన్నా... ప్రతీ సినిమాలోనూ హీరోయిన్లు డ్యాన్సులకే పరిమితం కావడం లేదుగా అని ఎదురు ప్రశ్నిస్తోంది. టాలీవుడ్ లో అయితే... డైరెక్టర్లు హీరో, హీరోయిన్ల కేరక్టర్ల ను బాగా బేలన్స్ చేస్తున్నారని ముచ్చట పడిపోతోంది.

ఒకవైపు ఆరేళ్ల క్రితం వచ్చిన కిక్ కంటే.. ఇందులోనే ఎక్కువ సందడి ఉంటుందని యూనిట్ ఒకవైపు చెబుతుంటే... ఇప్పుడీ లేలేత భామ మెసేజ్ అంటోంది. మెసేజ్ అనగానే శ్రీమంతుడు మాదిరిగా థియేటర్లకు జనాలు వచ్చేస్తారని అనుకుంటోందేమో. ట్రైలర్ ప్రామిసింగ్ గానే ఉంది కాబట్టి.. మూవీపైనా మంచి అంచనానాలే ఉన్నాయి. చూద్దాం.. తెల్లారితే థియేటర్లలో ఎలాగూ సందడి మొదలవుతుంది కదా.