Begin typing your search above and press return to search.

టింగ్ టింగ్: తెలుగొచ్చినా డబ్బింగ్ చెప్పరే!!

By:  Tupaki Desk   |   13 May 2017 11:23 AM GMT
టింగ్ టింగ్: తెలుగొచ్చినా డబ్బింగ్ చెప్పరే!!
X

టాలీవుడ్ లో ఎప్పుడూ పక్క ప్రాంతాల హీరోయిన్సే వెలుగుతూ ఉంటారనే విషయంలో సందేహం లేదు. తెలుగమ్మాయిలు స్టార్ హీరోయిన్స్ గా ఎదిగేందుకు మన దగ్గర అవకాశాలు చాలా చాలా తక్కువ. కొన్నేళ్ల క్రితం వరకూ అయితే.. అక్షరం ముక్క కూడా తెలుగు నేర్చుకోకుండానే కెరీర్ ని పూర్తి చేసేసేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది.

టాలీవుడ్ పై హీరోయిన్స్ ఫుల్ ఫోకస్ పెడుతున్నారు. దీంతో పాటే తెలుగుపై కూడా. ఇప్పుడున్న హీరోయిన్స్ లో చాలా మందికి తెలుగు బాగానే వచ్చు. అనుష్క.. సమంత.. తమన్నా.. రకుల్ ప్రీత్ సింగ్.. లావణ్య త్రిపాఠి.. రెజీనా కసాండ్రా.. రాశి ఖన్నాలకు తెలుగు బాగానే వచ్చు. కొద్దో గొప్పో ఈ మధ్యనే కాజల్ అగర్వాల్ కూడా తెలుగు నేర్చుకుంది. అయితే.. వీరెవరూ డబ్బింగ్ చెప్పడం మాత్రం జరగదు. ఒకవేళ చెప్పినా ఒకటీ అరా సినిమాలకే. కెరీర్ మొదటి నుంచి వీరి పాత్రలకు విన్న గొంతులను జనాలు అలవాటు పడిపోయి ఉంటారని.. అందుకే ఇప్పుడు వీరి సొంత గొంతుతో డబ్బింగ్ చెబితే జనాలు ఇష్టపడరని.. అందుకే వీరి స్వరాలను మేకర్స్ వినిపించరని ఓ వాదన ఉంది.

ఇది నిజమే అయినా.. ఇది మాత్రమే నిజం కాదని చెబుతున్నారు హీరోయిన్స్. ఒక పాత్రకు డబ్బింగ్ చెప్పడం అంటే.. చాలా కష్టపడాల్సి ఉంటుందని.. భాష మాత్రమే కాదు.. ఆ మాటలో ఉన్న అర్ధం.. వాక్యంలో ఉన్న భావం.. పదాల ఉచ్ఛారణ విధానం చాలా ముఖ్యమని.. ఇవన్నీ ఇప్పుడిప్పుడే తెలుగు నేర్చుకున్న వారికి వల్ల కాదని.. ప్రయోగాలు చేస్తే.. సినిమా ఎబ్బెట్టుగా మారిపోతుందని అంటున్నారు మేకర్స్.

నాన్నకు ప్రేమతో చిత్రంలో తాను డబ్బింగ్ చెప్పిన సంగతి గుర్తు చేసిన రకుల్.. అదే పని రా రండోయ్ వేడుక చూద్దాంలో చేయలేనని.. పల్లెటూరి పిల్ల రోల్ కు డబ్బింగ్ చెప్పలేనని అంగీకరించేసింది. తమన్నా స్వరం ఊపిరిలో వినిపించినా.. అన్ని కేరక్టర్లకు మిల్కీ చెప్పలేదు. డబ్బింగ్ ఆర్టిస్టులు ఎంతో కష్టపడి.. ఆ పాత్రకు ప్రాణం పోస్తారని హీరోయిన్స్ అంటున్నారు. సినిమాకి విజువల్ ఎంత ముఖ్యమో వాయిస్ కూడా అంతే ముఖ్యం. అందుకే తెలుగు వచ్చినా పరాయి భాషల హీరోయిన్స్ అన్ని పాత్రలకు డబ్బింగ్ చెప్పడం అసాధ్యం అన్నది వాస్తవమే కదా.