Begin typing your search above and press return to search.

చైతూతో కెమిస్ట్రీ అందుకే పండింద‌ట‌

By:  Tupaki Desk   |   23 May 2017 5:30 PM GMT
చైతూతో కెమిస్ట్రీ అందుకే పండింద‌ట‌
X
ఒక‌టి త‌ర్వాత ఒక‌టిగా ఛాన్సులు చేజిక్కించుకుంటూ ఫుల్ బిజీగా ఉన్న టాలీవుడ్ భామ‌ల్లో ర‌కుల్ ప్రీత్ సింగ్ ఒక‌రు. స్వ‌ల్ప వ్య‌వ‌ధిలోనే త‌న స‌త్తా చాటిన ఈ అమ్మ‌డి తాజా చిత్రం రారండోయ్ వేడుక చూద్దాం. నాగ‌చైత‌న్య‌తో జ‌త క‌ట్టిన ఈ ముద్దుగుమ్ము ఈ సినిమాలో చైతూతో కెమిస్ట్రీ అదిరిపోయేలా పండింద‌న్న మాట ప్ర‌తి ఒక్క‌రి నోటా వినిపిస్తోంది.

ఈ చిత్రంలో ప‌ల్లెటూరు ముద్దుగుమ్మ క‌నిపించ‌నున్న ర‌కుల్‌.. త‌న పాత్ర‌తో అంద‌రిని క‌ట్టిపారేయ‌టం ఖాయ‌మ‌ని న‌మ్మ‌కంగా చెబుతోంది.

ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో అంద‌రూ ప్ర‌స్తావిస్తున్న చైతూతో కెమిస్ట్రీ గురించి మీడియా అడిగిన ప్ర‌శ్న‌కు ఆ గుట్టు బ‌య‌ట‌కు చెప్పేసింది. ద‌ర్శ‌కుడు తీర్చిదిద్దిన పాత్ర పుణ్యమా అని అలా క‌నిపిస్తుందే త‌ప్పించి వేరే ఏమీ లేద‌న్న ఆమె.. చైతూతో న‌టించ‌టం ఒక చ‌క్క‌టి అనుభ‌వంగా అభివ‌ర్ణించింది.

తామిద్ద‌రం ఎప్ప‌టి నుంచో మంచి స్నేహితుల‌మ‌ని.. ఒక ఫ్రెండ్‌ తో క‌లిసి చేస్తున్న‌ప్పుడు ఆ వాతావ‌ర‌ణ‌మే వేరుగా ఉంటుంద‌ని.. సెట్ లో న‌డుచుకునే విధానం కూడా చాలా బాగుంటుంద‌ని చెప్పుకొచ్చింది. ఫ్రెండ్ తో క‌లిసి న‌టిస్తే.. కెమిస్ట్రీ అదిరిపోతుంద‌న్న‌ట్లుగా ర‌కుల్ చెబుతున్న ఫార్ములా స‌రికొత్త‌గా అనిపించ‌ట్లేదు?