Begin typing your search above and press return to search.
జాకీతో రకుల్ అంతా పబ్లిక్ గానే
By: Tupaki Desk | 14 Jan 2022 10:39 AM GMTరకుల్ ప్రీత్ సింగ్- నిర్మాత జాకీ భగ్నానీ డేటింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే. గత ఏడాది అక్టోబర్ 10న రకుల్ తన పుట్టిన రోజు సందర్భంగా ఆ విషయాన్ని ఇన్ స్టా ద్వారా రివీల్ చేసింది. జాకీ చిత్రాన్ని పోస్ట్ చేసి దానికి థాంక్యూ మై లవ్ అని సింబల్ ని యాడ్ చేసింది. ``మీరు ఈ సంవత్సరం అతి పెద్ద బహుమతి. నా జీవితాన్ని రంగుల మయం చేసినందకు ధన్యవాదాలు`` అని ఆరసుకొచ్చింది. సాధారణంగా చాలా మంది జంటలు తమ సంబంధాన్ని దాచడానికి ప్రయత్నిస్తుండగా ఈ జంట మాత్రం ఎలాంటి దాపరికాలు లేకుండా పబ్లిక్ గా ప్రకటించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రకుల్ ని ఈ విషయంపై ప్రశ్నించగా..
దాక్కుని ..రహస్యంగా పరిగెత్తే జంటలె ఎవరో అందరికీ తెలుసు. మేము ఇద్దరం అలాంటి వాళ్లకు దూరం. అలాంటి ఆలోచనలు కూడా మా మనసులోకి రానివ్వం. ఏ పనిచేసినా అది గౌరవంగా ఉండాలి. ప్రేమించుకోవడంలో తప్పేముందు. ఇందులో ఒకరికి ఒకరకి ఒకరం గౌరవం ఇచ్చిపుచ్చుకుంటాం` అని తెలిపింది. అలాగే ఈ ఏడాది పెళ్లి చేసుకుంటున్నట్లు కూడా మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీని గురించి ఏమంటారని ప్రశ్నించగా.. పెళ్లి సంగతి పక్కనబెడితే ఇలాంటి నాన్సెన్స్ మాత్రం ఎక్కడికి వెళ్లినా తప్పడం లేదు.
నేను నా పని మీద తప్ప ఇంకే విషయాలపై శ్రద్ద పెట్టలేదు. ఆలోచన కూడా చేయలేదు. నాజీవితంలో ఎంతో పారదర్శకంగా ఉన్నాను. ఆ సమయం వచ్చినప్పుడు ఎలా రాసి పెట్టి ఉంటే అలా జరుగుతుంది. ఇలాంటి విషయాల్లో ప్రేక్షకులకు ఊహగానాలు చేయకూడదు. ఏ విషయమైనా నాకు నేనుగానే వివరిస్తాను. ప్రస్తుతం నా దృష్టంతా కెరీర్ పైనే ఉంది. 10 సినిమాలు చేతిలో ఉన్నాయి. ఇంకా మరెన్నో పనులు బ్యాలెన్స్ ఉండిపోయాయి. ముందగా వాటన్నింటిని పూర్తిచేయాలని రకుల్ తెలిపింది.ఇక రకుల్ బాలీవుడ్ బిజీగా ఉంది. `ఎటాక్`..`రన్ వే 34`..`థాంక్ గాడ్`..`డాక్టర్ జీ`..`మిషన్ సిండ్రెల్లా`..`ఛత్రివాలి`..`ఇండియాన్ -2` సినిమాల్లో నటిస్తోంది.