Begin typing your search above and press return to search.

ఫ్లాపులొచ్చినా రకులే టాప్

By:  Tupaki Desk   |   16 Dec 2017 10:30 PM GMT
ఫ్లాపులొచ్చినా రకులే టాప్
X
ఓ హీరోయిన్ రేంజ్ తెలిసేందుకు ఆమె చేసే సినిమాల వాశితో పాటు రాసి కూడా ముఖ్యమే. ఎన్ని క్రేజీ ప్రాజెక్టులు రిలీజ్ చేయగలిగారనే పాయింట్ ను గమనించాల్సిందే. 2017 చివరకు వచ్చేసింది. మన దగ్గర హీరోయిన్లకు కొరత లేదు కానీ.. క్రేజీ భామలు మాత్రం కొంతమందే ఉంటారు. మలయాళీ భామల దాడి పెరగడంతో.. పలు ప్రాజెక్టులను మన హీరోయిన్లు మిస్ అయినా.. రకుల్ ప్రీత్ సింగ్ మాత్రం ఏకంగా ఐదు సినిమాలతో తన సత్తా చూపించేసింది.

గతేడాది ధృవతో గ్రాండ్ గా 2016కు ముగింపు పలకగా.. ఈ ఏడాది రకుల్ ప్రీత్ నటించిన ఐదు సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. విన్నర్ అంటూ మొదలుపెట్టినా విజయం దక్కించుకోలేకపోయిన రకుల్.. ఆ తర్వాత రారండోయ్ వేడుక చూద్దాం అంటూ సక్సెస్ ను టేస్ట్ చేసింది. పెర్ఫామెన్స్ కు గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత జయ జానకి జానకలో ఈ భామ నటనకు మంచి మార్కులు పడ్డా.. భారీ విజయం దక్కలేదు. దసరాకు వచ్చిన మహేష్ మూవీ స్పైడర్ పై రకుల్ చాలానే ఆశలు పెట్టుకున్నా అవి నెరవేరలేదు.

నవంబర్ లో కార్తితో కలిసి నటించిన ఖాకీ చిత్రం విజయం సాధించడం రకుల్ కి ఊరట అనే చెప్పాలి. మొత్తం మీద మిగిలిన హీరోయిన్స్ అంతా ఒకట్రెండు సినిమాలకే పరిమితం అయిపోయిన టైంలో.. రకుల్ మాత్రం ఏకంగా ఐదు చిత్రాలను విడుదల చేయగలిగింది. క్యారెక్టర్ల ఎంపికలో కాసింత జాగ్రత్త వహిస్తే.. రకుల్ టాప్ రేంజ్ కు చేరుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయంటారు ఇండస్ట్రీ జనాలు.