Begin typing your search above and press return to search.

రకుల్ తో పరాచికాలా? జాగ్రత్త సుమీ!!

By:  Tupaki Desk   |   16 Dec 2016 7:30 PM GMT
రకుల్ తో పరాచికాలా? జాగ్రత్త సుమీ!!
X
టాలీవుడ్ క్రేజీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ బోలెండంత ట్యాలెంటెడ్ అని ఇప్పటికే ప్రూవ్ అయిపోయింది. అందానికి ప్రతిభ తోడు అయితే ఎలా ఉంటుందో.. రకుల్ అలా ఉంటందనే కితాబులు కూడా అందుకుంటోంది. రీసెంట్ గా రామ్ చరణ్ మూవీ ధృవతో కలిపి.. ఈ ఏడాది హ్యాట్రిక్ హిట్స్ ను కూడా సాధించేసింది ఈ బ్యూటీ.

అయితే.. రకుల్ దగ్గర అందం- అభినయంతో పాటు మరో డిఫరెంట్ జోనర్ లో కూడా ట్యాలెంట్ కం అనుభవం ఉన్నాయి. అదే కరాటే. 'మా నాన్న ఆర్మీ ఆఫీసర్ కావడంతో.. చిన్నప్పటి నుంచి అథ్లెటిక్ స్కిల్స్ వంట బట్టాయి. దాదాపు నేను నేర్చుకున్నవన్నీ ఎండల్లో కష్టపడేవే అయి ఉంటుాయి. డ్యాన్సింగ్.. సింగింగ్.. హార్మోనియంలు మినహాయిస్తే.. గోల్ఫ్.. హార్స్ రైడింగ్.. కరాటే లాంటి వన్నీ ఎండలోనే కష్టపడి చేసేదాన్ని. నాకు కరాటేలో బ్లాక్ బెల్ట్ కూడా ఉంది' అఁటూ అసలు విషయం చెప్పింది రకుల్ ప్రీత్ సింగ్.

ఈ భామకు ఫిట్నెస్ అంటే చిన్నప్పటి నుంచి తెగ పిచ్చి. ఇప్పటికీ ఆ టేస్ట్ అలాగే కంటిన్యూ అవుతోందిట. అందుకే సినిమాల్లో హీరోయిన్ గా సెటిల్ అయినా.. సొంత వ్యాపారంగా జిమ్ సెంటర్ ను తెరిచిందిట రకుల్ ప్రీత్. ఇక సినిమాల విషయానికొస్తే.. మహేష్ బాబు-మురుగదాస్ కాంబినేషన్ లో రూపొందుతున్న మూవీతో పాటు.. సాయి ధరం తేజ్.. నాగ చైతన్య.. బెల్లంకొండ శ్రీనివాస్ లకు జోడీగా సినిమాలు చేసేస్తోంది రకుల్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/