Begin typing your search above and press return to search.

పోస్టర్ల కోసం ముద్దులు పెట్టను అంతే

By:  Tupaki Desk   |   28 Jun 2016 11:30 AM GMT
పోస్టర్ల కోసం ముద్దులు పెట్టను అంతే
X
పెదవి ముద్దులంటే ఇప్పుడు పెద్ద విషయమేం కాదు. దాదాపు హీరోయిన్లందరూ చేసేస్తున్నారు. సీన్‌ డిమాండ్‌ చేస్తే పెదాల ముద్దులు పెట్టడానికి పెద్ద విషయం ఏముంది అంటున్నారు. ఉదాహరణకు మన హాటీ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ నే తీసుకోండి. ఈ అమ్మడు కూడా పెదాల ముద్దుల్లో ఆరితేరిందే. తన హింది సినిమా యారియాన్‌ లో ఏకంగా రెండు నిమిషాలుపాటు సాగే లిప్‌ కిస్‌ తో మతిపోగొట్టేసింది.

ఇక ఇప్పటివరకు పెదాలు ముద్దులకు అడ్డు చెప్పని రకుల్‌.. ఇప్పుడు మాత్రం. కొన్ని షరతులు జోడిస్తోంది. ‘‘ముద్దు సన్నివేశాల్లో నటించడానికి నాకు అభ్యంతరం లేదు. కాకపోతే ఆ ముద్దులు పోస్టర్ల కోసమో.. ప్రమోషన్ల కోసమో కథలో ఇరికిస్తే కష్టం. ముద్దు అనేది కేవలం శృంగారపరమైన భావన కోసమే కాదు. అలాంటి సీన్లను ముద్దుముద్దుగా తెరకెక్కిస్తే బాగానే ఉంటాయి. కొన్ని సన్నివేశాల్లో ముద్దులు కూడా చాలా ఇంపార్టెంటే. కొన్ని వందల మాటల్లో చెప్పలేని భావం ఒక్క ముద్దుతో చెప్పొచ్చు. అలాంటి సన్నివేశాలైతే ఓకే'' అంటూ చెప్పుకొచ్చింది రకుల్.

మొత్తానికి ముద్దు గురించి అమ్మడు చెప్పిన కొత్త బాస్యం చాలా కొత్తగా ఉంది గురూ. ఇంతకీ తన కొత్త సినిమా ''ధృవ''లో మరి ఇలా ముద్దుపెట్టుకునే సీన్‌ ఏదైనా ఆఫర్‌ చేశారా? లేకపోతే కథలో ఇరికించారని అమ్మడు రిజక్టు చేసిందా?