Begin typing your search above and press return to search.
రకుల్ ప్రీత్ జిమ్ వ్యాపారం!!
By: Tupaki Desk | 16 Feb 2016 1:30 PM GMTఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ విపరీతమైన డిమాండ్ ఉన్న హీరోయిన్ మాత్రమే కాదు.. కొత్త వెంచర్ కూడా స్టార్ట్ చేసేస్తోంది. సినిమాల్లో గ్లామర్ ప్లస్ పెర్ఫామెన్స్ తో ట్యాలెంట్ చూపిస్తే.. బిజినెస్ లోనూ పాతుకుపోయేందుకు ప్లాన్స్ వేసింది. అందులోనూ ఆరోగ్యం పంచేస్తూ.. తనెంత ఫిట్ గా ఉందో.. జనాలకు కూడా ట్రైనింగ్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది రకుల్. ఎఫ్45 పేరుతో ఫిట్నెస్ సెంటర్ ను ప్రారంభింస్తోంది ఈ పంజాబీ భామ.
హైద్రాబాద్ లోని గచ్చిబౌలీలో ఈ నెల 20 ప్రారంభం జరుపుకోనున్న ఈ ఎఫ్45లో.. రకుల్ కు మేజర్ వాటానే ఉండగా.. ఇందులో ఈ సొగసరి సోదరుడు అమన్ కూడా పార్ట్ నరే. 'నేను మూడే విషయాలను నమ్ముతా, ఒకటి ఫిలింస్ - రెండు ఫిట్ నెస్ - మూడు ఫుడ్'అంటూ తన ఫిట్ నెస్ సీక్రెట్ ను బయటపెట్టిన రకుల్.. తన వ్యాపారం అందరిలాంటి సాధారణ జిమ్ సెంటర్ మాత్రం కాదని చెప్పింది. సాధారణంగా జిమ్ అంటే ట్రెడ్ మిల్ - ఎలిప్టికల్స్ కనిపిస్తూ ఉంటాయి. కానీ నా జిమ్ లో మాత్రం రోప్స్ - ట్రాలర్స్ మాత్రమే ఉంటాయి. ఫిట్ నెస్ కి చాలా మార్గాలు ఉంటాయని, అందులో తన మార్గం ఏంటో చూపిస్తానంటూ చెప్పింది ఈ సుందరి.
కేవలం ఫిట్ నెస్ వ్యాపారంతోనే సరిపెట్టేయకుండా.. హైద్రాబాద్ లో ఓ లగ్జరీ ఫ్లాట్ ని కూడా ఇప్పటికే రకుల్ ప్రీత్ సింగ్ కొనేసింది. ఇక్కడే సెటిల్ అయిపోతానని ఇన్ డైరెక్టుగా చెప్పిన ఈ పాప.. తన ఫిట్ నెస్ సెంటర్ లో ఇది మొదటి ఫ్రాంచైజీ అనడం విశేషం.