Begin typing your search above and press return to search.

వీణ స్టెప్ తో చితక్కొట్టేసిన రకుల్‌

By:  Tupaki Desk   |   19 Jun 2016 3:56 AM GMT
వీణ స్టెప్ తో చితక్కొట్టేసిన రకుల్‌
X
ఈ మధ్యన హీరోయిన్లు అవకాశం దొరికితే చాలు.. మెగా పాటలకు స్టేజీలపై డ్యాన్సులు వేసి.. చితక్కొట్టేస్తున్నారు. అదిగో మొన్ననే కంచె సినిమా హీరోయిన్‌ ప్రగ్యా జైస్వాల్‌ సిని'మా' అవార్డ్సులో మెగాస్టార్‌ పాత సినిమాల పాటలకు ఓ మెడ్లీ వేస్తే.. దానికి డ్యాన్సాడింది. ఇప్పుడు మరో మెగా హీరోయిన్ రకుల్‌ ప్రీత్‌ కూడా అదే పనిచేసిందిలే.

ఆల్రెడీ బ్రూస్ లీ.. సరైనోడు.. వంటి సినిమాల్లో మెగా హీరోలతో స్టెప్పులు కలిపి.. కొన్ని మూవ్ మెంటులు చితక్కొటిన సెక్సిణి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌.. గత రాత్రి ఫిలింఫేర్ అవార్డుల్లో కూడా దంచేసింది. తన ఒంపుసొంపులతో ఒకవైపు.. తన స్టెప్పుల ఊపులతో ఒకవైపు.. రఫ్ఫాడించిందంతే. ఆల్రెడీ బ్రూస్ లీ సినిమాలో మెగాస్టార్‌ తో కలసి స్ర్కీన్ పై కూడా కనిపించింది కదా.. అందుకేనేమో.. ఇంద్ర సినిమాలోని ఆయన వీణ స్టెప్‌ ను సైతం వేసేసింది. ఆ దెబ్బకి ఆడిటోరియం అంతా ఒక ఊపు ఊగిపోయింది అనుకోండి. ముందు రో లో కూర్చున్న రామ్‌ చరణ్‌, బన్నీ, రానా.. అలాగే సాయిధరమ్, అల్లు శిరీష్‌ వంటి హీరోలు రకుల్ కోసం వీలలు వేస్తే.. మెగాస్టార్‌ చిరంజీవి ఒక స్మయిలిచ్చారు.

ఇకపోతే తమ డ్యాన్సులతో ఆకట్టుకున్న హీరోయిన్లలో.. ప్రణీత అండ్‌ హరిప్రియ కూడా ఉన్నారులే.