Begin typing your search above and press return to search.

ఏందబ్బా మన రకుల్ ఫిలాసఫీ!!

By:  Tupaki Desk   |   4 Sept 2016 3:00 PM IST
ఏందబ్బా మన రకుల్ ఫిలాసఫీ!!
X
కాలం నిజంగా వెనక్కి తిరిగొస్తే మీ జీవితంలో సరిదిద్దుకొనే అంశాలేమైనా ఉన్నాయా? అని అడిగితే... ''నేను ఏ డెసిషన్ తీసుకున్నా అందుకు ఫీలవ్వలేదు. చిన్నప్పుడైనా.. మోడలింగ్‌ చేస్తున్నప్పుడైనా.. హీరోయిన్ అయ్యాకైనా.. లైఫ్‌ లో ఎప్పుడైనా ప్రతి పనీ నాకు నచ్చే చేశా. ఎప్పుడు ఏది చేయాలో అదే చేశానన్న సంతృప్తి ఉంది'' అంటోంది రకుల్ ప్రీత్.

మామూలుగా చాలామంది అప్పుడు ఆ డెసిషన్ తీసుకుని ఉండకపోతే ఇప్పుడు బాగుండేది అంటూ బాధపడతారు.. లేకపోతే ఆ డెసిషన్ తీసుకోవడం వలనే నాకు హ్యాపీనెస్ వచ్చింది అంటూ ఆనందపడుతుంటారు. కాని రకుల్ మాత్రం అలాంటివేం పెట్టుకోదట. ఎప్పుడు ఏది బెటర్ అనిపిస్తే అప్పుడు అదే చేసేస్తాం కాబట్టి.. దాని గురించి మళ్ళీ ఫీలవ్వడం ఎందుకు అంటోంది. ''బహుశా మా ఫ్యామిలీ వలనే ఇలా ఆలోచిస్తున్నాను. నాన్న ఆర్మీ ఉద్యోగి. దీంతో క్రమశిక్షణ చిన్నప్పటి నుంచే అలవాటైంది. చదువుకోవల్సిన సమయంలో చదువుకొన్నా. ఆడాల్సిన టైమ్‌లో ఆడా'' అంటోంది అమ్మడు.. తన ఫిలాసఫీలు ప్రకటిస్తూ.

ప్రస్తుతం ఆమె రామ్‌చరణ్‌ 'ధృవ' సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్న రకుల్.. మరో ప్రక్కన ఏ.ఆర్.మురుగుదాస్ డైరక్షన్లో మహేష్‌ బాబు సరసన ఒక సినిమా.. సాయిధరమ్‌ తేజ్‌ తో దర్శకుడు గోపిచంద్ మలినేని మూవీలను చేస్తోంది. అది సంగతి.