Begin typing your search above and press return to search.

రకుల్ కోరిక.. రానాయే టార్గెట్ ఇక

By:  Tupaki Desk   |   8 Feb 2018 4:57 PM GMT
రకుల్ కోరిక.. రానాయే టార్గెట్ ఇక
X
హీరోయిన్స్ అందాన్ని చూసి చాలా మంది అబ్బాయిలు అలాంటి అమ్మాయి గర్ల్ ఫ్రెండ్ గా ఉండే బావుండు అని చాలా కలలు కంటారు. ఇక అమ్మాయిలు కూడా అదే తరహాలో హీరోలాంటి వాడుంటే బావుండని ఆలోచిస్తుంటారు. మరి ఫ్యాన్సే ఆ రేంజ్ లో ఆలోచిస్తే వారికి నచ్చే పర్సన్ కోసం తారలు ఏ రేంజ్ లో ఆలోచించాలి. ఆ విషయం నిజంగా చాలా స్పెషల్ అని చెప్పాలి. ముఖ్యంగా హీరోయిన్స్ గురించి తెలుసుకోవడానికి ప్రతి ఒక్కరు అడిగే మొదటి ప్రశ్న ఒకటి ఉంటుంది.

నీకు ఎలాంటి భర్త కావాలి అలాగే అతనికి ఏమేమి అర్హతలు ఉండాలని ప్రతి సందర్భంలో హీరోయిన్స్ కు ఇలాంటి ప్రశ్న ఎదురవుతుంది. అదే తరహాలో రీసెంట్ గా ఆ ప్రశ్నకు క్యూట్ బ్యూటీ రకుల్ ఏం చెప్పిందో తెలుసా?. తనకు కాబోయే వాడు చాలా అందంగా ఉండలి ముఖ్యంగా హైట్ లో ఒక కండిషన్ ఉంది. ఆరు అడుగుల ఎత్తు ఉండి తీరాల్సిందే. ఒక్క ఇంచు తగ్గినా కూడా నా లిస్ట్ లో వారికి స్థానం లేదని గట్టిగా చెప్పేసింది.

అయితే ఈ 5.9 సుందరి ఎందుకు అంత ఎత్తు గలవాడిని కోరుకుందో తెలియదు గాని ప్రస్తుతం చాలా మంది ఒక సలహా ఇస్తున్నారు. చాలా మంది హీరోలు ఆరడుగులు ఉన్నప్పటికీ ఎక్కువగా రానా పేరు చెబుతున్నారు. ఒక్క మాటలో రానా హైటు అదేగా అంటూ జోకులు వేస్తున్నారు. ప్రస్తుతం రానా వయసు కూడా పెళ్లికి వచ్చేసింది. కానీ ఆ హీరో మాత్రం ఆ మూడ్ లో లేడు. మరి రకుల్ టార్గెట్ ఎలా ఉంటుంధో గాని కొందరు రానానే రకుల్ టార్గెట్ అని టైటిల్ ఇస్తున్నారు.